రాజమౌళి
తాజా చిత్రం ‘ఈగ’. ఈ నెల 30 న
విడుదల అవుతున్న ఈ చిత్రంపై ట్రేడ్
లో చాలా అంచనాలు ఉన్నాయి.
అపజయమెరగని దర్శకుడు రాజమౌళి..భారీ వ్యయంతో,పెద్ద
హీరోలెవరూ లేకుండా చిత్రం తీసి రిలీజ్ చేయటం
అందరిలో ఆసక్తి నింపుతోంది. డి.సురేష్బాబు
సమర్పణలో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు.
ప్రేమ వల్ల ప్రాణాలు కోల్పోయిన
ఓ యువకుడు పగతో ‘ఈగ’లా పుట్టి తన
పగను ఎలా తీర్చుకున్నాడనే కధతో
రూపొందిన సైంటిఫిక్ ధ్రిల్లర్ ఇది.
ఈ చిత్రం విడుదల సందర్భంగా రాజమౌళి ఓ ప్రకటన విడుదల
చేసారు. ఆ ప్రకటనలో...‘‘నా
కెరీర్లో ఇది ప్రత్యేకమైన
సినిమా. ప్రేమ, పగ నేపథ్యంలో సినిమా
సాగుతుంది. హృదయాలను బరువెక్కించే సన్నివేశాలు ఇందులో చాలా ఉంటాయి. అలాగే
ఉత్కంఠను రేకెత్తించే సీన్స్ కూడా కోకొల్లలు. ఈ
సమ్మర్లో పిల్లల నుంచి
పెద్దల వరకూ అన్ని వయసుల
వారినీ రంజింపజేసే సినిమా అవుతుంది. ఇటీవలే కీరవాణి స్వరపరిచిన ఈ చిత్రం పాటలను
విడుదల చేశాం. మంచి స్పందన లభిస్తోంది.
అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసి ఈ నెల
30న సినిమాను విడుదల చేయనున్నాం’’
అని తెలిపారు.
నాని,
సమంత, సుదీప్ ప్రధాన పాత్రధారులు గా రూపొందే ఈ
చిత్రాన్ని ఫేస్ బుక్, ట్విట్టర్,
మీడియా, టీవీ ఛానెల్స్ అనే
తేడా లేకుండా భారీ లెవల్లో పబ్లిసిటీ
చేస్తున్నారు. ఆయన తాజాగా ఈ
చిత్రం కధ గురించి చెబుతూ
తమ చిత్రం నాని,బిందుల ల
మధ్య లవ్ స్టోరీ అన్నారు.
నాని పాత్రలో నాని, బిందు పాత్రలో
సమంత నటిస్తోంది అన్నారు. మధ్యలో సుదీప్ పాత్ర ప్రవేసించి ఏమి
చేసిందనేదే కథ అంటున్నారు.
ఆయన మాటల్లోనే... ఆ అబ్బాయి పేరు
నాని. పెళ్లీడు వచ్చేసిన కుర్రాడు. ఓ రోజు బిందు
అనే అందాల భామని చూసి
మనసు కూడా పారేసుకొన్నాడు. రోజులు,
నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా మూగగా ఆరాధిస్తాడే తప్ప
ప్రేమ విషయం చెప్పడు. ఇదంతా
బిందుకీ సరదాగానే ఉంది. ఓ రోజు
ధైర్యం చేసి 'ఐ లవ్
యూ' చెప్పేద్దాం అనుకొన్నాడు. అప్పుడే కథలోకి మరో పాత్ర ప్రవేశించింది.
నాని, బిందుల మధ్య అడ్డుగోడలా నిలిచింది.
అతనెవరు? ఈ ప్రేమ కథ
ఏ మలుపు తిరిగింది? అనే
విషయాలు మా సినిమా చూసి
తెలుసుకోవల్సిందే అన్నారు ఎస్.ఎస్.రాజమౌళి.
ఇక ఈ చిత్రానికి సంగీతం
కీరవాణి, స్టైలింగ్.. రమా రాజమౌళి, ఛాయాగ్రహణం..
సెంధిల్ కుమార్, సమర్ఫణ డి.సురేష్ బాబు
0 comments:
Post a Comment