హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి నుండి తనకు బెదిరింపులు
వచ్చాయన్న విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యలతో ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ
ఏకీభవించారని టీవి ఛానెళ్లలో పెద్దఎత్తున
వార్తలు వస్తున్నాయి. తనకు జగన్కు
అత్యంత సన్నిహితుడైన వ్యక్తి నుండి బెదిరింపులు వచ్చాయని
వర్మ చెప్పారని అంటున్నారు.
జగన్
నుండి హెచ్చరికలు రావడంతో తాను రక్త చరిత్ర-2
సినిమాలో చాలా సీన్లు తొలగించాల్సి
వచ్చిందని చెప్పారని అంటున్నారు. జగన్కు సన్నిహితుడే
వార్నింగ్ ఇచ్చాడని అన్నారని అంటున్నారు. కొన్ని సీన్లు తొలగించాలని తనపై తీవ్రమైన ఒత్తిడి
వచ్చిందని చెప్పారని అంటున్నారు. దీంతో తప్పని పరిస్థితులలో
చాలా సీన్లు తొలగించాల్సి వచ్చిందని అన్నారని అంటున్నారు. వర్మ ఈ విషయమై
మీడియాకు ఎస్సెమ్మెస్లు పంపించారు. అయితే
జగన్ అరెస్టు అయిన సమయంలో లగడపాటి
దీనిని తెరపైకి తీసుకు రావడం, వర్మ ఏకీభవించడం చర్చనీయాంశమైంది.
దర్శక
నిర్మాత రామ్ గోపాల్ వర్మను
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ బెదిరించారని
కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఆరోపించిన విషయం తెలిసిందే. నా
ఇష్టం పుస్తకం ఆవిష్కరణ సభలో వర్మే తనకు
స్వయంగా ఆ విషయం చెప్పారని
ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఆ పుస్తకాన్ని తానే
విడుదల చేశానని, ఆ సమయంలో వర్మ
తనకు ఆ విషయం చెప్పారని
ఆయన అన్నారు. రక్త చరిత్ర సినిమాలో
తన పాత్రను పెట్టవద్దని జగన్ వర్మను బెదిరించినట్లు
ఆయన తెలిపారు.
మీడియా
ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు వర్మ చెప్పిన మాటలనే
తాను చెప్పానని లగడపాటి అన్నారు. ఇన్నాళ్లు ఎందుకు ఆ విషయం చెప్పలేదని
ఓ టీవీ చానెల్ ప్రతినిధి
అడిగితే - సందర్భం వచ్చింది కాబట్టి చెప్పానని ఆయన అన్నారు. కావాలంటే
వర్మనే అడగాలని ఆయన ఆ ప్రతినిధితో
అన్నారు.
ఆరోపణలపై
విచారణ పూర్తయితే వైయస్ జగన్ రాజకీయాలకు
అనర్హుడు అవుతాడని ఆయన అన్నారు. వైయస్
రాజశేఖర రెడ్డి మాట తప్పని నేత
అయితే జగన్ మూట విప్పని
నేత అని ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెసు ప్రజా సంక్షేమం కోరే
పార్టీ అయితే జగన్ మూట
విప్పని నేత అని లగడపాటి
అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చార్జిషీట్లు తప్ప మ్యానిఫెస్టోలు లేవని
ఆయన అన్నారు. తల్లి విజయమ్మ ప్రచారం
చేసినా వైయస్సా కాంగ్రెసు పార్టీకి ఓట్లు రాలవని ఆయన
అన్నారు.
0 comments:
Post a Comment