హైదరాబాద్:
బాలకృష్ణ నటించిన అధినాయకుడు సినిమాపై ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తామని చెప్పిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ సాక్షి మీడియాపై
ఎందుకు మౌనం వహిస్తున్నారని తెలుగుదేశం
శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సాక్షి టీవీ చానెల్లో,
పత్రికలో ఇతర పార్టీల అభ్యర్థులకు
వ్యతిరేకంగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా వార్తలు వస్తున్నాయని ఆయన గురువారం మీడియా
ప్రతినిధుల సమావేశంలో అన్నారు. సాక్షి మీడియాపై కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని
ఆయన చెప్పారు. ఉప ఎన్నికలు పూర్తయ్యే
వరకు సాక్షి టీవీ చానెల్, పత్రికలపై,
నమస్తే తెలంగాణ పత్రికపై, టీ చానెల్పై
నిషేధం విధించాలని ఆయన డిమాండ్ చేశారు.
మీడియా
ఓ పార్టీకి అనుకూలంగా వార్తలు ఇస్తే పెయిడ్ న్యూస్గా పరిగణించాలని కేంద్ర
ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఆదేశాలు ఇచ్చిందని, ఇంత స్పష్టమైన మార్గదర్శక
సూత్రాలున్నా భన్వర్లాల్ సాక్షి మీడియాపై,
నమస్తే తెలంగాణ, టి - చానెళ్లపై చర్యలు
తీసుకోవడం లేదని ఆయన అన్నారు.
సాక్షి మీడియాలో వైయస్ రాజశేఖర రెడ్డికి
అనుకూలంగా రాస్తున్న వార్తాకథనాలను అభ్యర్థుల ఖర్చు కింద జమ
చేయాలని ఆయన అన్నారు.
సాక్షి
టీవీ చానెల్లోనూ, సాక్షి పత్రికపైనా
వైయస్ రాజశేఖర రెడ్డి చిత్రం ఉందని, ఇది ఎన్నికల ప్రవర్తనా
నియమామళికి విరుద్ధమని ఆయన అన్నారు. అడ్వర్టయిజ్మెంట్లను మినహాయిస్తే సాక్షి మీడియాలో వార్తలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థుల ప్రచార వార్తలు, ఇతర పార్టీల వ్యతిరేక
ప్రచారమని ఆయన అన్నారు. సాక్షి
మీడియా ప్రత్యక్షంగా, పరోక్షంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థుల కోసమే పనిచేస్తున్నాయని ఆయన
విమర్శించారు. భన్వర్లాల్కు చాలాసార్లు
ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు.
భన్వర్లాల్పై, సాక్షి
మీడియాపై కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని
ఆయన చెప్పారు. ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని ఆనయ చెప్పారు. సాక్షి
మీడియాకు సంబంధించిన వార్తాకథనాలపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ఆయన భన్వర్లాల్ను డిమాండ్ చేశారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ తన
ప్రచారంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నారని, ఎక్కువ వాహనాలను వాడుతున్నారని తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
0 comments:
Post a Comment