మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న
‘ఎవడు’ చిత్రంలో ఇప్పటికే బ్రిటిష్ తార అమీ జాక్స్
సెంకడ్ హీరోయిన్గా ఎంపికయిన సంగతి
తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలో బ్రిటిష్
డాన్సర్ స్కార్లెట్ విల్సన్ ఐటం సాంగు చేయబోతోందని
తెలుస్తోంది. స్కార్లెట్ విల్సన్ ఇప్పటికే ఇమ్రాన్ హస్మి, అభయ్ డియోల్ దిబాకర్
బెనర్జీ రూపొందిస్తున్న ‘షాంఘై’ చిత్రం ద్వారా భారతీ సినిమా రంగంలోకి
ఐటం గర్ల్గా అడుగు
పెట్టింది.
తొలుత
ఈచిత్రంలో శ్వేతా భరద్వాజ్ అనుకున్నప్పటికీ కొత్త మొహం కావాలనే
ఉద్దేశ్యంతో స్కార్లెట్ విల్సన్ను ఫైనలైజ్ చేశారు.
ఏమాత్రం సిగ్గు పడకుండా అందాలు ఆరబోయే స్కార్లెట్ విల్సన్తో తెలుగు ప్రేక్షకులకు
మంచి రొమాంటిక్ కిక్ ఇప్పించేందుకు దర్శక
నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.
ఇటీవల
ఓ ఇంటర్య్వూలో స్కార్లెట్ మాట్లాడుతూ...నేను ప్రొఫెషనల్ బాన్సర్గా ఇండియాలో రాణిస్తున్నందుకు
చాలా ఆనందంగా ఉంది. చరణ్ లాంటి
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోతో
కలిసి పని చేయడం చాలా
హ్యాపీగా ఉంది అని చెప్పకొచ్చింది.
వంశీ
పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
బ్యానర్ పై ప్రముఖ నిర్మాత
దిల్ రాజు ఈ చిత్రాన్ని
నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. గత కొన్ని రోజుల
క్రితమే ఈ సినిమా షూటింగ్
మెగా స్టార్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా చిత్ర
ప్రారంభోత్సవం జరిగింది. ప్రస్తుతం రెగ్యూలర్ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో సమంతను
లీడ్ హీరోయిన్ గా ఎంపిక చేశారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ
చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు.







0 comments:
Post a Comment