న్యూఢిల్లీ:
వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పకపోతే తాను మౌన దీక్షకు
దిగుతానని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వి హనుమంత
రావు గురువారం న్యూఢిల్లీలో హెచ్చరించారు. వైయస్ జగన్ తిరుమల
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం వివాదాస్పదమైన
విషయం తెలిసిందే. దీనిపై విహెచ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తిరుమల
తిరుపతి దేవస్థానంలో అనుచితంగా వ్యవహరించిన ఎందరో అందుకు తగిన
మూల్యం చెల్లించుకున్నారని అన్నారు. వైయస్ జగన్ కూడా
మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. తిరుమలలో దేవాలయంలోకి ప్రవేశించే ముందు ఎంతటి వారైనా
గంట కొట్టడం సంప్రదాయమని, కానీ జగన్ మాత్రం
అలా చేయకపోవడమేమిటని ప్రశ్నించారు. మహాద్వారం వద్ద జగన్కు
అనుకూలంగా నినాదాలు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు.
జగన్
తిరుమలలో పర్యటించిన రోజు చీకటి రోజు
అన్నారు. డిక్లరేషన్ పైన సంతకం చేయనందుకు
జగన్ వెంటనే శ్రీవారికి క్షమాపణ చెప్పాలన్నారు. జగన్ పైన తిరుమల
తిరుపతి దేవస్థానం, దేవాదాయ శాఖ వెంటనే చర్యలు
తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో క్షమాపణ
చెప్పకున్నా, చర్యలు తీసుకోకున్నా తాను తిరుమలలో దీక్ష
చేస్తానని చెప్పారు.
నిబంధనలకు
విరుద్దంగా హంగామా సరికాదన్నారు. పవిత్రమైన స్థలాలకు వచ్చినప్పుడు ఎవరైనా దేవుడి పైన నమ్మకంతో రావాలని
రాజకీయాల గురించి కాదన్నారు. దేవుడి ముందు కూడా జగన్కు అంత అహంకారామా
అని ప్రశ్నించారు. నియమాల ఉల్లంఘన సరికాదన్నారు.
0 comments:
Post a Comment