శ్రీకాకుళం:
విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డికి పేదల బతుకుల గురించి
ఏం తెలుసునని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి
ధర్మాన ప్రసాద రావు విమర్శించారు. ఇప్పుడు
ప్రజలలో తిరిగి బుగ్గలు నిమిరినంత మాత్రాన పేదల గురించి వారి
జీవితాల గురించి తెలుస్తుందా అని ప్రశ్నించారు. తన
వ్యాపారాలను అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి
పదవి కోసం ఉబలాటపడుతున్న జగన్
అతి ప్రమాదకరమైన వ్యక్తి అన్నారు.
అతని
చేతికి అధికారం దక్కితే రాష్ట్రాన్ని లూటి చేస్తారని మండిపడ్డారు.
రాష్ట్రం మొత్తం మీద నీ తండ్రి
మాట జవదాటిన తొలి వ్యక్తి జగనే
అని విమర్శించారు. అధికారం కోసం జగన్ అర్రులు
చాస్తున్నారని ద్వజమెత్తారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కాంగ్రెసు పార్టీ కార్యక్రమాలు అని, ఇవి వారసత్వం
కిందకు రావని ప్రదేశ్ కాంగ్రెసు
కమిటీ మాజి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ
డి.శ్రీనివాస్ అన్నారు.
వైయస్సార్
పార్టీ అధినేత జగన్ సంక్షేమ పథకాలు
తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
ప్రవేశ పెట్టినవని, వాటిని సక్రమంగా అమలు చేయడం లేదంటూ
ప్రచారం చేయడం సరికాదన్నారు. 2004లో
ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రణాళిక
కమిటీలో సంక్షేమ పథకాలు అన్నింటిని చర్చించి, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదించిన తర్వాతనే
ప్రచారం చేసినట్లు చెప్పారు. సంక్షేమ పథకాలు కాంగ్రెసు పార్టీవి మాత్రమేనని, ఒక వ్యక్తి పథకాలు
ఎంత మాత్రం కావని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి
పీఠం అంటే ఏదో ఎల్డిసి ఉద్యోగం కాదని
వైయస్ జగన్ గుర్తెరగాలన్నారు. జగన్
ముఖ్యమతం్రి పదవి కోసం తహతహలాడుతున్నారని
ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పదవి అంటే రాష్ట్ర
ప్రజల జీవితాలను చేతిలో పెట్టడమన్న విషయాన్ని గమనించాలని సూచించారు. జగన్ వంటి వారు
ఆ పదవికి అర్హులు కారని చెప్పారు. ఆయన
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఉప ఎన్నికల ప్రచారంలో
పాల్గొన్నారు.
0 comments:
Post a Comment