కడప:
కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు రెచ్చిపోయారు. నందలూరు
మండలం లేబాక గ్రామ సేవకుడు
పోలి యానాదయ్య, అతని భార్యపై వైయస్సార్
కాంగ్రెస్ పార్టీ నేతలు దాడి చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా కట్టిన జెండాలను తొలగించడంతో ఈ దారుణానికి పాల్పడ్డారు.
ఈ గ్రామంలో మే మూడున జగన్
పర్యటన నిమిత్తం వారు వాల్ పోస్టర్లు,
ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
శనివారం
ఉదయం వరకూ అవి అలాగే
ఉండడంతో ఎన్నికల నిబంధనల ప్రకారం వాటిని తొలగించాలని ఎంపిడివో ఆదేశించారు. ఈమేరకు అతను వాటిని తొలగించాడు.
దీంతో మా పార్టీ ఫ్లెక్సీలు,
వాల్పోస్టర్లు తొలగిస్తావా అని పలువురు నేతలు
అతనిపై దాడిచేశారు. ఇంట్లోంచి ఈడ్చుకుంటూ వచ్చి విద్యుత్ స్తంభానికి
కట్టేసి పిడిగుద్దుల వర్షం కురిపించారు. గాయపడ్డ
యానాదయ్యను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు
యానాదయ్య నుంచి వివరాలు సేకరించి
కేసు నమోదు చేశారు. వైయస్సార్
కాంగ్రెస్ నేతలు తన భార్య
మంజులపై దాడి చేశారని యానాదయ్య
ఫిర్యాదు చేశాడు. కాగా సిఐటియూ జిల్లా
నేతలు బాధితుడిని పరామర్శించి జరిగిన సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత మేడా మల్లికార్జున
రెడ్డి వచ్చి యానాదయ్యతో మాట్లాడారు.
దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని
ఆర్డీవో శ్రీనివాసులుకు ఫిర్యాదు చేశారు.
మండల
అధికారుల సూచనల మేరకు యానాదయ్య
గ్రామంలో కట్టిన జెండాలను తొలగించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలకు పలుమార్లు సూచించారు. ఎంత చెప్పినప్పటికీ వారు
తొలగించక పోవడంతో శనివారం అతనే తీసేశాడు. ఈ
విషయంపై పోలీసులు విచారణ జరిపి పదకొండు మందిపై
కేసు నమోదు చేశారు.
0 comments:
Post a Comment