హైదరాబాద్:
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
తన హయాంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డికి సహకరించారని సిబిఐ తరఫు న్యాయవాది
సోమవారం కోర్టులో వాదించారు. జగన్ను కోర్టులో
హాజరుపరిచిన అనంతరం వాదనలు ప్రారంభమయ్యాయి. మొదట సిబిఐ తరఫు
న్యాయవాది ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడారు.
జగన్
ఇచ్చిన వివరణ సంతృప్తిగా లేదని,
అందుకే అరెస్టు చేసినట్లు చెప్పారు. హవాలా ద్వారా పెద్ద
ఎత్తున విదేశాల నుండి జగన్ కంపెనీలలోకి
నిధులు వచ్చాయని, దాదాపు రూ.140 కోట్ల పెట్టుబడులు వచ్చాయని,
వీటికి సంబంధించి జగన్ నుండి ఎలాంటి
సమాధానం లేదని అన్నారు. జగన్
సిబిఐకి సహకరించడం లేదన్నారు. జగన్ ఆస్తుల కేసులో
74 మంది నిందితులు ఉన్నారని తెలిపారు. వాన్పిక్ ద్వారా
రూ.300 కోట్ల ప్రజా ధనం
దుర్వినియోగం అయిందని వాదించారు.
జగన్ను పెట్టుబడులపై ఇంకా
ప్రశ్నంచాల్సి ఉందని, అందుకే కస్టడీకి ఇవ్వాలని కోరారు. జగన్ ఆర్థిక నేరాలకు
పాల్పడ్డారని, హవాలా ద్వారా సొమ్మును
విదేశాలకు మళ్లించారని, ఇది దేశ ద్రోహమే
అవుతుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
పలు కంపెనీలకు సెజ్లు ఇచ్చారని,
అందుకు ప్రతిఫలంగా లబ్ధిదారులు జగన్ కంపెనీలలో పెట్టుబడులు
పెట్టారన్నారు. జగన్కు వైయస్
రాజశేఖర రెడ్డి సహకరించారన్నారు.
ఇప్పటికింకా
సిబిఐ విచారణ పూర్తి కాలేదని, 24 మంది నిందితులపై ఛార్జీషీట్
వేశామని, 74 మందిని విచారించాల్సి ఉందన్నారు. ప్రభుత్వానికి జగన్ నష్టం చేకూర్చారన్నారు.
మూడు రోజుల విచారణలో జగన్
సహకరించలేదన్నారు. ప్రభుత్వానికి నష్టం చేకూర్చి జగన్
ధనవంతుడయ్యాడు. ఇప్పటి వరకు తమ విచారణలో
జగన్ రూ.1200 కోట్లు లాభపడినట్లు తేలిందన్నారు. జగన్ను అరెస్టు
చేయడంలో తప్పులేదన్నారు.
నాలుగేళ్లలో
వేలకోట్ల సామ్రాజ్యాన్ని తయారు చేసుకున్నారన్నారు. లక్సెంబర్గ్ నుండి
ఏషియన్ ఇన్ ఫ్రా ద్వారా
సండూర్ పవర్కు రూ.140
కోట్లు తెప్పించుకున్నారన్నారు. సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశముందనే అరెస్టు
చేసినట్లు చెప్పారు. కాగా విచారణకు సహకరించడం
లేదని చెప్పేందుకు ఆధారంగా సిబిఐ కోర్టుకు ఓ
సిడిని అందజేసింది.
0 comments:
Post a Comment