హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఆదివారం మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గుంటూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా
వరకు జగన్ పార్టీకి ఒక్క
సీటు కూడా ఉప ఎన్నికలలో
దక్కదని లగడపాటి మండిపడ్డారు. జగన్ ఓ అరాచక
శక్తి అని ధ్వజమెత్తారు. జగన్
జైలుకు వెళ్లడం తప్ప జన్మలో ముఖ్యమంత్రి
కాలేరని జోస్యం చెప్పారు.
రాష్ట్రంలో
ప్రజలందరూ జగన్ అరెస్టును కోరుకుంటున్నారని
ఆయన అన్నారు. అంతకుముందు రోజు శనివారం ఆయన
మాట్లాడుతూ.. వాన్పిక్ వ్యవహారంలో
800 కోట్ల రూపాయలు దండుకున్న జగన్ వల్లే మోపిదేవి
వెంకటరమణ అరెస్టు కావాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల
శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ విజయమ్మ
తన కొడుకును సరైన మార్గంలో పెంచితే
ఇంతమంది అమాయకులు బలకాకపోయి ఉండేవారని అభిప్రాయపడ్డారు.
తండ్రి
మరణిస్తే డబ్బులు, టపాసులతో సంబరంగా యాత్రలు చేయడం మంచిది కాదని...
పెళ్లికీ, చావుకూ తేడా గుర్తించాలని జగన్కు ఏఐసిసి అధ్యక్షురాలు
సోనియా గాంధీ హితవు పలికారన్నారు.
అదే తప్పన్నట్లుగా జగన్ ప్రచారం చేస్తున్నారని
విమర్శించారు. ఉప ఎన్నికలలో కాంగ్రెసుకు
తప్ప ఎవరికి ఓట్లు వేసినా అవి
నిప్పుల్లో పోసినట్లేనని గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివ
రావు అన్నారు.
మోపిదేవి
అరెస్టు దురదృష్టకరన్నారు. ఆయన నిర్దోషి అన్నారు.
తెలంగాణ నేతలెవరైనా గుంటూరులో ప్రచారం చేయడానికి వస్తే వారిని రాచమర్యాదలతో
ఆహ్వానిస్తామన్నారు.
2014 వరకు కిరణ్ కుమార్ రెడ్డియే
ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు.
బలహీనవర్గాలకు చెందిన మంత్రి కాబట్టే మోపిదేవిని అరెస్టు చేసి బలిపశువును చేశారని
మరో మంత్రి దానం నాగేందర్ అన్నారు.
అప్పట్లో కేబినెట్ తీసుకున్న నిర్ణయాల మేరకే మోపిదేవి సంతకాలు
చేశారన్నారు.
0 comments:
Post a Comment