హైదరాబాద్:
రాష్ట్రంలోని 18 శాసనసభా స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో పోటీ
చేస్తున్న 15 మంది అభ్యర్థులకు నేరచరిత్ర
ఉన్నట్లు సమాచారం. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల తరఫున 53 మంది అభ్యర్థులు ఎన్నికల
బరిలో ఉన్నారు. ఓ అభ్యర్థి హత్య
కేసును ఎదుర్కున్నాడు. కింది కోర్టు శిక్ష
వేయగా, హైకోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల
చేసింది. కళంకిత అభ్యర్థుల్లో ఐదుగురు తెలుగుదేశం పార్టీకి చెందినవారు కాగా, మరో ఐదుగురు
కాంగ్రెసు పార్టీకి చెందినవారు
అనంతపురం
జిల్లా రాయదుర్గం నియోజకవర్గం అభ్యర్థి గుణపాటి దీపక్ రెడ్డిపై హైదరాబాదులోని
బంజారాహిల్స్ పోలీసు స్టేషనులో భూవివాదం కేసు పెండింగులో ఉన్నట్లు
ఆ ఆంగ్ల దినపత్రిక రాసింది.
రాయదుర్గం పోలీసు స్టేషనులో నమోదైన ఓ కేసులో కూడా
ఆయన నిందితుడని ఆ పత్రిక రాసింది.
తనపై తప్పుడు కేసులు బనాయించారని, వ్యక్తిగత కక్షతో తనపై కేసులు పెట్టారని
దీపక్ రెడ్డి తన అఫిడవిట్లో
రాశారు.
నామినేషన్తో పాటు దాఖలు
చేసిన అఫిడవిట్ ప్రకారం - వరంగల్ జిల్లా పరకాల అభ్యర్థుల్లో బిజెపి
అభ్యర్థి విజయచంద్రా రెడ్డికి ఏ విధమైన నేరచరిత్ర
లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి మొలుగూరి బిక్షపతిపై నాలుగు కేసులున్నాయి. కాంగ్రెసు అభ్యర్థి సంబారి సమ్మారావుపై కేసు ఉంది. తెలంగాణ
ఉద్యమంలో పాల్గొంటున్నందున బిక్షపతి రాష్ట్ర ప్రభుత్వం కేసుల్లో ఇరికించిందని తెరాస నాయకులు అంటున్నారు.
కర్నూలు
జిల్లా ఆళ్లగడ్డ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాంపుల్లారెడ్డిపై 1997లో హత్య కేసు
నమోదైంది. ఆయనకు కర్నాలు నాలుగో
అదనపు జిల్లా న్యాయస్థానం 2001లో జీవితఖైదు విధించింది.
అయితే, హైకోర్టు ఆ కేసును కొట్టేసింది.
రాష్ట్రంలోని 18 శానససభా స్థానాలకు ఈ నెల 12వ
తేదీ పోలింగ్ జరగనుంది.
0 comments:
Post a Comment