నందమూరి
నటసింహం బాలకృష్ణ నటించిన అధినాయకుడు చిత్రం తొలి రోజు యావరేజ్,
మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ
కలెక్షన్లు మాత్రం జోరుగానే రాబడుతోంది. జూన్ 1న విడుదలైన
ఈచిత్ంర లాస్ట్ వీకెండ్ వరకు టోటల్ కలెక్షన్లు
రూ. 20 కోట్లు దాటాయని ట్రేడ్ వర్గాల సమాచారం.
ట్రేడ్
రిపోర్ట్స్ ప్రకారం విడుదలైన తొలి రోజు ఈచిత్రం
వెరీగుడ్ రెస్పాన్స్ సంపాదించుకుంది. సింగిల్ స్కీన్స్లలో 70% నుంచి 100% ప్రేక్షకులతో... మల్టీ ప్లెక్స్లలో
50% నుంచి 75 శాతం ప్రేక్షకులతో థియేటర్లు
కిటకిటలాడాయి. తొలి రోజు ఓవరాల్గా రూ. 7.2 కోట్ల
వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.
అయితే
రెండో రోజైన శనివారం(జూన్
2) కలెక్షన్స్ ఒక్కసారిగా 15% డౌన్ అయిపోయాయి. రెండో
రోజు కలెక్షన్ల రూ. 5.9 కోట్లు మాత్రవే వచ్చాయి. అయితే మూడో రోజైన
ఆదివారం మళ్లీ పుంజుకుని ఏకంగా
రూ. 7.4 కోట్లు వసూలు చేసినట్లు చెబుతున్నారు.
వీకెండ్ కావడంతో తొలి మూడు రోజుల్లోనే
ఈచిత్రం ఓవరాల్గా రూ. 20.5 కోట్ల
వసూళ్లు సాధించింది.
పరమవీర
చక్ర లాంటి ప్లాపు చిత్రం,
కమర్షియల్గా సక్సెస్ ఇవ్వలేని
శ్రీరామరాజ్యం సినిమా తర్వాత...... ‘అధినాయకుడు' చిత్రం మంచి కలెక్షన్లతో దూసుకెలుతుండటం
ఇటు బాలయ్యతో పాటు అభిమానులకు ఊరట
కలిగించే విషయం.
బాలకృష్ణ
త్రిపాత్రాభినయంతో లక్ష్మీరాయ్, సలోని కథానాయికలుగా శ్రీ
కీర్తి క్రియేషన్స్ పతాకంపై పరుచూరి మురళి దర్శకత్వంలో అధినాయుకడు
చిత్రం రూపొందింది. తాతగా, తండ్రిగా, కొడుకుగా మూడు వైవిధ్యమైన పాత్రల్లో
బాలకృష్ణ నటించారు. జయసుధ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం,
ఎం.ఎస్.నారాయణ, వేణుమాధవ్,
ఆదిత్య మీనన్ తదితరులు నటించిన
ఈ చిత్రానికి కెమెరా: సురేందర్రెడ్డి, సంగీతం: కల్యాణి మాలిక్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాత: ఎంఎల్ కుమార్ చౌదరి,
దర్శకత్వం: పరుచూరి మురళి
0 comments:
Post a Comment