బాలకృష్ణతో
అధినాయకుడులో చేసిన లక్ష్మీ రాయ్
ఇప్పుడు ఏడుపు ఒక్కటే తక్కువ
అన్నట్లుగా ఉంది. అధినాయకుడు చిత్రంలో
ఆమె రెచ్చిపోయి నటించినా ఆ పాత్రకు గుర్తింపు
రాలేదు. సినిమా కు మార్నింగ్ షోకే
డివైడ్ టాక్ రావటంతో ఆమె
డీలా పడిపోయిందని వినికిడి. దానికి తోడు ఆమెను పబ్లిసిటీ
కాంపైన్ లో సైతం పట్టించుకోవటం
లేదు. మొత్తం బాలకృష్ణ మూడు క్యారెక్టర్స్ మీదే
పబ్లిసిటి మొత్తం జరుగుతోంది. వాటినే హైలెట్ చేయటంతో ఆమెకు ఏమి చెయ్యాలో
అర్దం కాని స్ధితి ఏర్పడిందిట.
ఈ క్రమంలో ఆమె ఈ చిత్రం
డేట్స్ కోసమని మిగతా చిత్రాలు కొన్ని
వదిలేసుకుంది. వాటిని తలుచుకుని భాదపడుతోందిట.
అధినాయకుడు
చిత్రం షూటింగ్ బాగా లేటవటం,దానకి
తోడు సినిమా రిలీజ్ కూడా లేటవటం జరిగింది.
మరో ప్రక్క 'అధినాయకుడు' కలెక్షన్స్ అదరకొడుతున్నాయని నిర్మాత ఎమ్.ఎల్.కుమార
చౌదరి చెప్తున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...
'మండుటెండల్లో బాలయ్య కలెక్షన్ల కుంభవృష్టి' సృష్టిస్తున్నాడని అన్నారు.నందమూరి బాలకృష్ణ నటించిన 'అధినాయకుడు' చిత్రం భారీ కలెక్షన్లతో మొదలైందని
చెప్పారు. శ్రీకీర్తి క్రియేషన్స్ బ్యానర్లో రూపొందిన ఈ
చిత్రానికి పరుచూరి మురళి దర్శకుడు. లక్ష్మీ
రాయ్, సలోని హీరోయిన్స్ గా
చేసారు.
ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ... 'చాలా ఆనందంగా ఉంది.
జూన్ 1న విడుదలైన సినిమా
అద్భుతమైన కలెక్షన్ల రికార్డ్ సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి యు.ఎస్.
వరకూ బాలయ్య సినిమా సూపర్‌డూపర్‌హిట్
అని టాక్ వచ్చింది. కథాపరంగా
అన్ని హంగులు ఉండేట్టు దర్శకుడు జాగ్రత్తలు తీసుకున్నాడు' అని అన్నాడు.
ఇందులో
బాలయ్య పలికే డైలాగ్స్నుద్దేశించి..
ఓ పార్టీపై విమర్శలు వచ్చాయి. ఈ సినిమా చూశాక
ఎవర్నీ ఉద్దేశించినవికావని అర్థమవుతుందని, సినిమాను అన్ని పార్టీలవారు చూడాల్సిందిగా
ఆయన పేర్కొన్నారు. 'మేం సినిమా తీసినప్పుడు
ఎలక్షన్లు రాలేదు. విడుదల సమయంలో ఎలక్షన్లు వచ్చాయి. అందుకే ఈ సినిమా ఇంత
హైప్ క్రియేట్ చేసింది' అని అన్నారు.
దర్శకుడు
మాట్లాడుతూ... 'నా చుట్టూ టెక్నీషియన్స్
వల్ల సినిమాను బాగా చేశాను. ఫ్యామిలీ
ఎంటర్టైనర్తోకూడిన సినిమా
ఇది. మానవీయ విలువలు కూడా ఉన్నాయి. బాలకృష్ణ
పెద్ద పాత్రను చూసి చాలామంది ఎన్.టి.ఆర్.ను
పోల్చుకుంటున్నారు. ఆ పాత్రకు బాలకృష్ణ
న్యాయం చేశాడు' అని చెప్పారు. అప్పటి
ఎన్.టి.ఆర్.తో
చేయకపోయినా ఆయన వారసుడితో చేయడం
ఆనందాన్నిచ్చింది' అని అన్నారు.
0 comments:
Post a Comment