హైదరాబాద్:
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో
ప్రధాన నిందితుడు భాను కిరణ్తో
కలిసి సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ సినీ నిర్మాతలు సి
కల్యాణ్, శింగనమల రమేష్, వ్యాపారవేత్త ఆంజనేయ గుప్తా ముందస్తు బెయిల్ కోసం బుధవారం కోర్టును
ఆశ్రయించారు. సినీ నిర్మాత నట్టి
కుమార్ తమపై సిఐడికి తప్పుడు
ఫిర్యాదు చేశారని వారు తమ పిటిషన్లో పేర్కొన్నారు.
వారు
తమకు ముందస్తు బెయిల్ కావాలని నాంపల్లి నాలుగో మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఫిర్యాదులను పరిశీలించి
ప్రాథమిక ఆధారాలు లభించాకే కేసు నమోదు చేశామని,
ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి బెయిల్ ఇవ్వొద్దని సిఐడి తరఫు న్యాయవాది
వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను
ఈ నెల 25కు వాయిదా
వేశారు.
తెలుగు
సినీ నిర్మాతలు సింగనమల రమేష్, సి. కళ్యాణ్లపై,
ఆంజనేయులు గుప్తాపై సిఐడి కేసులు నమోదు
చేసిన విషయం తెలిసిందే.భాను
కిరణ్తో కలిసి ల్యాండ్
సెటిల్మెంట్లకు, బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణల మీద వారిపై సిఐడి
కేసులు నమోదు చేసింది. బాధితులు
ఇచ్చిన ఫిర్యాదుల మేరకు సిఐడి వారిపై
కేసులు నమోదు చేసింది. సి.
కళ్యాణ్పై నిర్మాత నట్టి
కుమార్ సిఐడికి ఫిర్యాదు చేశారు.
నట్టి
కుమార్ ఈ వ్యవహారంలో సిఐడి
ముందు కూడా హాజరయ్యారు. వీరిరువురు
పరస్పరం తీవ్ర ఆరోపణలు కూడా
చేసుకున్నారు. భాను కిరణ్తో
కలిసి సి.కళ్యాణ్, సింగనమల
రమేష్ పలు దందాలు చేసినట్లు
ఆరోపణలు వచ్చాయి. సూరి హత్యకు శింగనమల
రమేష్ సమక్షంలోనే భాను కిరణ్ టెస్ట్
ఫైరింగ్ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి.
కాగా ఇటీవల నట్టి కుమార్
సి కల్యాణ్పై తీవ్రస్థాయిలో విరుచుకు
పడిన విషయం తెలిసిందే. నిర్మాత
సి. కళ్యాణ్ భానుకు బినామీయే అని నొక్కి చెప్పారు.
సి. కళ్యాణ్ను ఎందుకు అరెస్టు
చేయడం లేదని ప్రశ్నించారు. వీరిద్దరు
అక్రమ డాక్యుమెంట్లతో బ్యాంకులకు కోట్లకు టోకరా వేశారని నట్టి
ఆరోపించారు.
0 comments:
Post a Comment