కర్నూలు/కడప: కర్నూలు జిల్లా
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి,
రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్
పాల్గొన్న రోడ్డుషోలో చెప్పుల వర్షం కురిసింది. నేతల
ప్రచారం పైకి గుర్తు తెలియని
వ్యక్తులు చెప్పును విసిరారు. ఈ చెప్పు చిరంజీవి
దిశగా దూసుకు రావడంతో ఆయన తలవంచి తన
చేతిని అడ్డు పెట్టుకున్నారు. చెప్పు
విసిరిన సమయంలో ప్రచారం రథంపైన కిరణ్, చిరంజీవిలు మాత్రమే ఉన్నారు. ఇరుకు సందులు కావడంతో
జనాల్లో ఎవరు ఆ చెప్పులు
విసిరారో సెక్యూరిటీ సిబ్బంది గుర్తించ లేకపోయిందని తెలుస్తోంది.
ఆ తర్వాత నిర్వహించిన సభలో గందరగోళం ఏర్పడింది.
మైకులు సరిగా పని చేయక
పోవడం వల్ల కాసేపు గందరగోళం
ఏర్పడింది. ఓ సమయంలో చిరంజీవి
మాట్లాడుతుండగా.. అతని ప్రసంగాన్ని ఆపించి..
సైలెంట్గా ఉండండి.. లేదంటే
చిరంజీవిని ఇక్కడ నుండి పంపిస్తానని
కిరణ్ చెప్పాల్సి వచ్చింది. కాగా అంతకుముందు ఆళ్లగడ్డ
నియోజకవర్గంలో వీరు ఎన్నికల ప్రచారం
నిర్వహించిన విషయం తెలిసిందే.
మరోవైపు
కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో మంగళవారం కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల ప్రచారం అడ్డుకోవడం
ఉద్రిక్తతకు దారి తీసింది. ఒక
దశలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేసి
పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత అంబటి రాంబాబు
ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే కొరముట్ల
శ్రీనివాసులు మండలంలోని బొజ్జాలవారిపల్లె ప్రచారానికి వెళ్లారు.
గ్రామ
పొలిమేరలోనే స్థానికులు, కాంగ్రెసు కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. గ్రామంలో అడుగుపెడితే సహించేది లేదని ఎదురు తిరిగారు.
ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు, ఘర్షణ
వాతావరణం నెలకొంది. సమాచారమందుకున్న పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం పోలీసుల సాయంతో బందోబస్తు మధ్య అంబటి గ్రామం
దాటారు.
ఈ సంఘటడనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వైయస్సార్ కాంగ్రెసు తెలిపింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ప్రచారానికి వెళ్లగా అడ్డుకున్న గ్రామస్థులు వారిని తమ ఇళ్లలోకి రానివ్వకుండా
గేట్లకు చెప్పులను అడ్డు పెట్టారు.
0 comments:
Post a Comment