ప్రముఖ
దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఈగ' చిత్రం గురించి
ఎదురు చూపులకు ఇక తెరపడినట్లే. ఎప్పుడెప్పుడా
అని ఎదురు చూస్తున్న ఈచిత్రాన్ని
విడుదల చేసేందుకు ఎట్టకేలకు డేట్ఫిక్స్ చేశారు. చిత్ర యూనిట్ సభ్యుల
నుంచి అందిన సమాచారం ప్రకారం
ఈచిత్రాన్ని జులై 6వ తేదీన
విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
సమంత,
నాని, కన్నడ స్టార్ సుదీప్
ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్
కీలక పాత్రను పోషించనుంది. స్పెషల్ ఎపెక్టు పనులు సరైన సమయంలో
పూర్తి కాక పోవడం వల్లనే
ఈచిత్రం విడుదల వాయిదా పడుతూ వస్తోంది. సురేష్
ప్రోడక్షన్ సమర్పణలో ఈచిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు.
యం యం కీరవాణి సంగీతం
అందించారు.
‘ఈగ'
సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే ‘తను ప్రేమించిన అమ్మాయితో
హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న
ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్
చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే ‘ఈగ' రూపంలో మరుజన్మ
ఎత్తిన ఆ కుర్రాడిని గత
జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో ‘ఈగ'గానే విలన్
పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ
ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన
ఓ మనిషిపై.. అదీ ఓ పరమ
క్రూరుడి పై ఆ ‘ఈగ'ఎలా గెలిచిందీ..ఆ
గెలుపు కోసం ఏమేం చేసిందీ'
అన్నదే క్లుప్తంగా ‘ఈగ' కథాంశం.
ఆడియో
విడుదలై వంద రోజులు పూర్తి
చేసుకున్న తర్వాత విడుదలయ్యే చిత్రం బహుషా..‘ఈగ‘ ఒక్కటే కాబోలు. అయితే సినీ ప్రేమికులు
మాత్రం రాజమౌళి ఈ చిత్రాన్ని డిలే
చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి చర్యల కారణంగా విసుగుపుట్టి
సినిమాపై ఆసక్తి తగ్గుతుందని అటున్నారు. ఈ చిత్రానికి సాయి
కొర్రపాటి నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి 'సంగీతం:
ఎం.ఎం.కీరవాణి, ఛాయాగ్రహణం:
సెంథిల్కుమార్, సమర్పణ: డి.సురేష్ బాబు.
0 comments:
Post a Comment