హైదరాబాద్:
బాలకృష్ణ నటించిన అధినాయకుడు సినిమాకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ క్లీన్చిట్
ఇచ్చారు. అధినాయకుడు సినిమాపై ఏ విధమైన అభ్యంతరాలు
లేవని ఆయన మంగళవారం మీడియా
ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఎన్నికల నిబంధనలను సినిమా ఉల్లంఘించలేదని ఆయన చెప్పారు. అధినాయకుడు
సినిమా ఓ పార్టీ ప్రచారానికి
పనికి వచ్చేలా ఉందంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
వైయస్సార్
కాంగ్రెసు పార్టీ నాయకుల ఫిర్యాదుతో అధినాయకుడు సినిమా పరిశీలన బాధ్యతను ఈసి నిపుణుల కమిటీకి
నివేదించింది. నిపుణుల కమిటీ నివేదిక సమర్పించిన
తర్వాత దానికి భన్వర్లాల్ క్లీన్చిట్
ఇచ్చారు. కాగా, న్యాయపరిధిలోని అంశాలపై
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
వ్యాఖ్యలు చేశారంటూ వచ్చిన ఫిర్యాదుపై నివేదిక కోరినట్లు ఆయన తెలిపారు.
మతపరమైన
వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని
ఆయన చెప్పారు. మద్యం దుకాణల పట్ల
కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ఆయన తెలిపారు. 2009 ఎన్నికల్లో
32 కోట్ల రూపాయలను స్వాధీనం స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. తొమ్మిది
కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్లు
ఆయన తెలిపారు.
మొత్తం
539 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు భన్వర్లాల్ చెప్పారు. ఉప
ఎన్నికల కోసం కేంద్ర బలగాలు
వస్తున్నాయని ఆయన చెప్పారు. ఆయన
మంగళవారం 12 జిల్లాల ఎన్నికల అధికారులతో, ఎస్పీలతో, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లపై ఆయన వారితో సమీక్ష
జరిపారు. ఈ నెల 8వ
తేదీలోగా వోటరు స్లిప్పులు అందించాలని
ఆయన ఆదేశించారు.
0 comments:
Post a Comment