నట సింహం నందమూరి
బాలకృష్ణతో డిన్నర్ చేసే అవకాశం అంటే నందమూరి అభిమానులు ఎంత ఆనందిస్తారో చెప్పక్కర్లేదే.
తాజాగా అది అందుకునే అవకాశం వచ్చింది. అందుకోసం చేయాల్సిందల్లా ‘బసవతారకం క్యాన్సర్
హాస్పిటల్' కోసం కొంత డొనేషన్ చెల్లించడమే. ఒక వ్యక్తి అయితే 100$, ఫ్యామిలీ మొత్తం
కలిసి బాలయ్యతో డిన్నర్ చేయాలంటే 150$ చెల్లిస్తే సరిపోతుంది. ఓ మంచి ఉద్దేశ్యంతో ఈ
కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జులై 4న అమెరికాలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
పూర్తి వివరాలు క్రింద పేర్కొనబడ్డాయి.
బసవతారకం
ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పటల్ చైర్మన్గా నందమూరి బాలకృష్ణ
వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు సంస్థ 15 వేలకు
పైగా ఆరోగ్య శ్రీ పేషెంట్ల కు
వైద్యం అందించింది. అలానే సుమారు 30 కోట్ల
రూపాల విలువైన రాయితీలను పేద పేషంట్లకు, వైట్
రేషన్ కార్డు హోల్డర్స్ కు ఇచ్చే చికిత్స
అందజేశారు. రానున్న రోజులలో మరింత ఆధునికమైన వైద్యాన్ని
పేదలకు అందించే దిశగా బసవతారకం ఇండో
అమెరికన్ క్యాన్సర్ హాస్పటల్ కృషి చేస్తుంది. మారు
మూల ప్రాంతాలలో కూడా క్యాన్సర్ స్క్రీనింగ్
క్యాంపు నిర్వహించేందుకు అవసరమైన ప్రత్యేకమైన బస్సును కలిగిన ఏకైక సంస్థ బసవతారకం
ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పటల్.
బాలకృష్ణ
ప్రస్తుతం ‘శ్రీమన్నారాయణ' చిత్రంలో నటిస్తున్నారు. ఆర్.ఆర్. మూవీ
మేకర్స్ సమర్పణలో ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై
ప్రముఖ నిర్మాత రమేష్ పుప్పాల నిర్మాతగా... 'సామాన్యుడు' ఫేం రవికుమార్ చావలి
దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రంలో
బాలయ్య సరసన పార్వతీ మెల్టన్,
ఇషా చావ్లా నటిస్తున్నారు.
ఈ చిత్రం బాలకృష్ణ చేస్తున్న ఎడ్వంచరస్ థ్రిల్లర్గా యూనిట్ సభ్యులు
చెబుతున్నారు. బాలకృష్ణ స్టైల్లో వుంటూనే అటు
క్లాస్ని, ఇటు మాస్ని అన్నివర్గాల వారినీ
ఆకట్టుకునే రీతిలో 'శ్రీమన్నారాయణ' రూపొందుతోంది. ఆరుగురు విలన్స్కీ, బాలయ్యబాబుకీ మధ్య
జరిగే టగ్ ఆఫ్ వార్
చాలా ఆసక్తిరకంగా వుంటుందట.
ఈ చిత్రంలో ఇంకా విజయ్కుమార్,
సురేష్, వినోద్కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్రెడ్డి, కృష్ణభగవాన్, ఆహుతిప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్. నారాయణ,
రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావు రమేష్, నాగినీడు,
సుప్రీత్, సుధ, సత్యకృష్ణ నటిస్తున్నారు.
ఈచిత్రానికి
మాటలు: పోలూర్ ఘటికాచలం, సినిమాటోగ్రఫి: టి.సురేందర్రెడ్డి,
సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: నాగేందర్, కో డైరెక్టర్: ఎస్.సురేష్కుమార్, పబ్లిసిటీ డిజైనర్: రమేష్వర్మ, కాస్ట్యూమ్స్:
ప్రసాద్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: వి.చంద్రమోహన్, మేనేజర్స్:
కమల్మోహన్రావు, రామ్మోహన్,
నిర్మాత: రమేష్ పుప్పాల, కథ-కథనం-దర్శకత్వం:
రవికుమార్ చావలి.
0 comments:
Post a Comment