ఇప్పుడు
ఇండియాలో మోస్ట్ డిమాండింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరంటే ముందుగా వినపడే పేరు ప్రకాష్ రాజ్దే. జాతీయ అవార్డు
గ్రహీత అయిన ప్రకాష్ రాజ్
ఇటు సౌతిండియా సినీ పరిశ్రమలతో పాటు
బాలీవుడ్ సినిమాల్లోనూ దూసుకెలుతున్నాడు. సౌత్లో నిర్మాణమయ్యే
సగానికి సగం స్టార్ హీరోల
సినిమాలు ప్రకాష్ రాజ్ తప్పకుండా ఉంటాడంటే
అతని డిమాండ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
తన డిమాండుకు తగిన విధంగానే ప్రకాష్
నిర్మాతల నుంచి రెమ్యూనరేషన్ వసూలు
చేస్తున్నాడు. తాజాగా పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో
రూపొందబోయే ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రంలో ప్రకాష్ నటిస్తున్నాడు. తాజాగా అందిన సమాచారం ప్రకారం
ప్రకాష్ రాజ్ ఈ చిత్రానికి
ప్రకాష్ రోజుకు రూ. 10 లక్షల రెమ్యూనరేషన్ డిమాండ్
చేస్తున్నాడట. అంతే కాదు సాధారణంగా
ప్రకాష్ రాజ్ రోజుకు 8 గంటల
కంటే ఒక్క నిమిషం కూడా
ఎక్కువ పని చేయడని, ఒక్క
గంటల షూటింగ్ లేటైనా ఇంకో డే కింద
లెక్క వేస్తాడని అంటున్నారు.
పూరి
అనుకున్న క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ అయితేనే సెట్
అవుతాడు కాబట్టి నిర్మాత కూడా అంత మొత్తం
రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఒప్పుకోక తప్పలేదంటున్నారు. రోజుకు 10 లక్షలు అంటే 10 రోజులకు కోటి....100 రోజులకు 10 కోట్లు. సాధారణంగా తెలుగులో మహేష్ బాబు లాంటి
స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు 100 రోజులపైనే
డేట్స్ ఇచ్చి అటూ ఇటుగా
10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
ఈ లెక్క ప్రకారం ప్రకాష్
రాజ్ రేటు స్టార్ హీరోలతో
సమానంగా ఉంది. ఈ రేంజి
రెమ్యూనరేషన్తో టాలీవుడ్లోనే కాదు
ఇండియా సినీ పరిశ్రమలోనే కాస్లియెస్ట్
క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రకాష్ రాజ్ మారాడని సినీవర్గాలు
చర్చించుకుంటున్నాయి.
‘కెమెరామెన్
గంగతో రాంబాబు’ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్
కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్,
ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్:
విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే,
దర్శకత్వం: పూరి జగన్నాథ్
0 comments:
Post a Comment