రవితేజ,
ఇలియానా కాంబినేషన్ లో పూరీ జగన్నాధ్
రూపొందించుతున్న చిత్రం 'దేవుడు చేసిన మనుషులు'. ఈ
చిత్రంలో పూరీ జగన్నాధ్ తనదైన
35+14+10 ఫార్ములానే ఉపయోగించి పూర్తి చేసినట్లు చెప్తున్నారు. ఇంతకీ 35+14+10 ఫార్ములా ఏమిటీ అంటే... 35 రోజులు
టాకీ షూటింగ్, 14 రోజులు పాటలు షూటింగ్, 10 రోజులు
ఫైట్స్ షూటింగ్ అని అర్దం. కరెక్టుగా
ఒక్కరోజు ఎక్కువ తక్కువా కాకుండా అనుకున్నది అనుకున్నట్లుగా ఈ రోజుల్లో పూర్తి
చేసాడని ఇండస్ట్ల్రీలో వినపడుతోంది.
ఈ చిత్రం కాన్సెప్టు గురించి పూరీ జగన్నాధ్ చెపుతూ...
దేవుడు ఎంతో మంచివాడు. అందుకే
చేతులెత్తి దణ్నంపెడుతున్నాం. మరి ఆ దేవుడు
చేసిన మన మనుషుల్లో మంచివాళ్లు
ఎంతమంది? కర్త, కర్మ, క్రియ...
అన్నీ మనమే అయినా ఆ
పైవాడిపైనే భారం మోపుతూ ఎలాంటి
పనులు చేస్తున్నాం? దేవుడే చేసిన ఓ యువకుడు
సమాజానికి ఏం చెప్పాడు? తదితర
విషయాలు తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే
అంన్నారు.
అలాగే...
దేవుడున్నాడని మనస్పూర్తిగా నమ్మి ఈ సినిమా
చూడండి అనే కార్డ్ వచ్చిన
తర్వాత సినిమా స్టార్ అవుతుంది. హండ్రెడ్ పర్శంట్ ఎంటర్టైనర్ ఇది. నాకు రవితేజ
కాంబినేషన్ లో చాలా మంచి
హిట్ సినిమా అవుతుంది అన్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న
ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 22న
పాటల్ని విడుదల చేస్తారు.
దేవుడున్నాడా?
లేడా? అనే ప్రశ్న వేసుకోవడం,
సమాధానం కోసం తర్కానికి విరుద్ధంగా
ఆలోచించడం.. ఇవన్నీ కాలహరణమే. ఆపదలో ఆదుకొన్న మనిషిలో,
ఆకలి పోగొట్టిన మనసులో దేవుడ్ని చూసుకోవచ్చు. దేవుడంటే గుడిలోనే ఉండాలని ఏముంది? అడుగడుగున గుడి ఉంది... అందరిలో
గుడి ఉంది. ఆ విషయమే
మా కథలో చెబుతున్నాం అన్నారు.
అలాగే చిత్రం పొగ్రెస్ వివరిస్తూ...ఇటీవల బ్యాంకాక్లో
రవితేజ, ఇలియానా, ప్రకాష్ రాజ్లపై కొన్ని
కీలక సన్నివేశాలు చిత్రీకరించాం అన్నారు.
రవితేజ
సరసన ఇలియానా హీరోయిన్ గా చేస్తున్న ఈ
సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ,ఎంఎస్ నారాయణ, కోవై
సరళ, సుబ్బరాజు,ఫిష్ వెంకట్, జ్యోతిరానా
వంటి వారు నటిస్తున్నారు. ఫొటో
గ్రఫి.. శ్యామ్ కె నాయుడు, సంగీతం..
రఘు కుంచే, పాటలు.. భాస్కర భట్ల, ఎడిటింగ్.. ఎస్
ఆర్ శేఖర్. కథ, స్క్రీన్ ప్లే,
మాటలు, దర్శకత్వం... పూరీ జగన్నాధ్.
0 comments:
Post a Comment