విశాఖపట్నం:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నేత, ప్రముఖ
సినీ నటి రోజా కాంగ్రెసు
పార్టీ నేతలపై ప్రశ్నల వర్షం కురుపించారు. బుధవారం
రోజా విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం
నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె
మాట్లాడారు. కేంద్రమంత్రి పురంధేశ్వరి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపైన
తీవ్రస్థాయిలో విరిచుకు పడ్డారు. వారికి పలు ప్రశ్నలు సంధించారు.
ఉప ముఖ్యమంత్రి పదవి కోసం మామ
అయిన స్వర్గీయ నందమూరి తారక రామారావుకు నీ
భర్త వెన్నుపోటు పొడవ లేదా అని
దగ్గుపాటి పురంధేశ్వరిని ప్రశ్నించారు. ఎన్నికలను కాంగ్రెసు పార్టీ ఎందుకు రెఫరెండంగా తీసుకోవడం లేదని అడిగారు. దివంగత
ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
ప్రవేశ పెట్టిన పథకాలు అన్ని కాంగ్రెసు పార్టీ
వే అయితే మిగతా కాంగ్రెసు
పాలిత రాష్ట్రాలలో ఎందుకు ప్రవేశ పెట్టలేదన్నారు.
ముస్లింలు
దేశమంతటా ఉన్నారని, ముస్లిం రిజర్వేషన్ని దేశమంతటా ఎందుకు
అమలు చేయలేకపోయారన్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు పార్టీకి అమ్ముకున్న రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి నీతి గురించి మాట్లాడే
నైతిక హక్కు లేదన్నారు. చెన్నైలోని
చిరు కుమార్తె ఇంట్ల దొరికిన నగదు
గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డి ముందుంది మంచి కాలమంటున్నారని, కానీ
కాంగ్రెసు పాలనలో ముందుందు ముంచే కాలమే అన్నారు.
బెంగళూరు
విమానాశ్రయం వద్ద ముఖ్యమంత్రి కిరణ్
అయితే ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు.
కర్నాటకలోనే అయిదు ఎకరాలు ఆక్రమిస్తే
ఇక్కడ ఎన్ని ఎకరాలు ఆక్రమించి
ఉంటారో తెలుసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి బాగోతం త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు. కాంగ్రెసులో దొంగలైనా దోపిడీదారులైనా, అవినీతిపరులైనా అధిష్టానం వారికి అండగా ఉంటుందన్నారు. పదవీ
కాంక్షతో పురంధేశ్వరి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ మెప్పు కోసమే
ఆజాద్ మాట మార్చారన్నారు.
0 comments:
Post a Comment