ప్రముఖ నటుడు,
డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయికుమార్ తన కూతురు పెళ్లి గురించి ఓ వెరైటీ ఇన్విటేష్ తయారు
చేయించారు. అందులో తమను తాము సింహాల కుటుంబం చెప్పుకున్న సాయికుమార్, వాళ్లావిడతో సహా
అందరికీ సింహం బిరుదు తగిలించారు. ఆగస్టు 9 సాయికుమార్ కూతురు వివాహం జరుగనుందట. పోలీస్
స్టోరీ చిత్రంలో నటించినప్పుడు సాయికుమార్ ‘కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్' అంటూ
కొట్టిన డైలాగ్ చాలా ఫేమస్ అయింది. బహుషా ఆ నేపథ్యంలో తనకు తానుగా ఈ సింహం బిరుదు తగిలించుకుని
ఉంటారు.
ఆ ఇన్విటేషన్పై ఓ లుక్కేయండి...
ఇన్విటేషన్లోని
వివరాలు...
మా అమ్మాయి ‘జ్యోతిర్మయి' పెళ్లి కుదిరింది
పెళ్లికొడుకు
‘కృష్ణ ఫల్గుణ'
రిసెప్షన్...ఆగస్ట్ 9న సాయంత్రం-గురువారం
రాత్రి 7 గంటలకు
మీరెంత
బీజీగా ఉన్నా దయచేసి ఈ
‘డేటు'నోటు చేసుకోవాల్సిందిగా ప్రార్థన
మీ ఆశీస్సులతో ఎదిగిన వాణ్ణి..
మా పాపని, మా అల్లుణ్ణి ఆశీర్వదిస్తారని
ఆశిస్తూ...
‘పెళ్లి
ప్రతికతో కలుస్తాము'
మీ
‘నాలుగో
సింహం' సాయికుమార్
‘లేడీ
సింహం' సురేఖా సాయికుమార్
‘బాల
సింహం' ఆది
‘వృద్ధ
సింహం' పి.జె.శర్మ
0 comments:
Post a Comment