హైదరాబాద్:
మాజీ మంత్రి శంకర రావు గుజరాత్
ముఖ్యమంత్రి నరేంద్ర మోడిపై విరుచుకు పడ్డారు. దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీపై మోడీ వ్యాఖ్యలు సరికాదని
ఆయన అన్నారు. ఇందిరా గాంధీ సెక్యులర్ కాదని
అనడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు
చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా 2014 ఎన్నికలలో నీ రాష్ట్రంలో నిన్నే
ఓడిస్తారని విరుచుకు పడ్డారు. ప్రధాని పదవి చేపట్టాలని ఉత్సుకత
మోడీ ఉత్సుకత చూపిస్తున్నారని, కానీ ఆయన ఇలాగే
మాట్లాడితే కేవలం గుజరాత్లో
మాత్రమే కాకుండా బిజెపి పాలిత అన్ని రాష్ట్రాలలో
ప్రభుత్వాలు తుడిచి పెట్టుకు పోతాయన్నారు.
మోడి
ఒత్తిడిలో మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోందన్నారు. దేశంలో మతాలు, ప్రాంతాలకు అతీతంగా 52 శాతం మంది ప్రజలు
ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ నేత దాడి వీరభద్ర
రావు పైనా శంకరన్న మండిపడ్డారు.
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని ఇటాలియన్ అని దాడి అనడం
సరికాదన్నారు. సోనియాపై చేసిన వ్యాఖ్యలను వెంటనే
వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లేదంటే
తాను దాడి ఇంటి ముందు
ధర్నాకు దిగుతానని చెప్పారు. కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్
ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాం నుంచి ఇప్పటి
వరకు 18 ఏళ్లుగా ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలపై సిబిఐ విచారణ జరపాలని
ఆయన అన్నారు. ప్రభుత్వాలు వేలాది ఎకరాల భూములను సంతర్పణ
చేశాయని ఆరోపించారు.
ఆ భూములన్నింటినీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. లేదంటే తాను హైకోర్టును ఆశ్రయిస్తానని
హెచ్చరించారు. ఔటర్ రింగు రోడ్డు
వ్యవహారంలోనూ పెద్ద ఎత్తున భూఆక్రమణలు
జరిగాయని, వాటి పైన కూడా
న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పారు. నిబంధనలకు విరుద్దంగా పరిశ్రమలకు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవాలన్నారు.
0 comments:
Post a Comment