హైదరాబాద్:
హైదరాబాదులోని చంచల్గుడా జైలులో
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వెజ్
జ్యూస్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఫిట్నెస్ కోసం ఆయన కూరగాయల
ద్రవాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక ఖైదీగా ఆయన ప్రతి రోజూ
మాంసాహారం కూడా తీసుకునే అవకాశం
ఉంటుంది. అయితే ఆయన కూరగాయల
జ్యూస్లకే పరిమితం అవుతున్నట్లు
సమాచారం.
జగన్కు బయట నుంచి
కూరగాయలు తెప్పించుకునే సౌకర్యం ఉంటుంది. ప్రత్యేక ఖైదీల కిచెన్ ఎంక్లోజర్లో జ్యూస్లు
చేయడానికి వీలుంటుంది. జైలులో శారీరక వ్యాయామం కోసం జిమ్ సౌకర్యం
లేదు. అయితే జాగింగ్ సౌకర్యం
మాత్రం ఉంది. జగన్ దాదాపు
గంటన్నర సేపు వార్తాపత్రికలు, పుస్తకాలతో
బైబిల్ పఠనం చేస్తున్నట్లు తెలుస్తోంది.
వార్తాపత్రికలను, పుస్తకాలను ఆయనకు కుటుంబ సభ్యులు
అందజేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆయనతో
పాటు పది మంది ఇతర
ఖైదీలు ఉన్నారు. వారితో ఆయన చాలా తక్కువగా
మాట్లాడుతున్నట్లు సమాచారం. ప్రజాజీవితంలో ప్రసంగాలు చేసే జగన్ జైలులో
ఇంట్రావర్ట్గా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు.
ప్రత్యేక ఖైదీలకు షటిల్ ఆడే అవకాశం
ఉంటుంది. రాకెట్లను, నెట్ను జైలు
అధికారులు ఇస్తారు.
గురువారంనాడు
జగన్ కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదు. వారానికి
మూడు ములాఖత్లు మాత్రమే ఉంటాయి.
అవి ముగిసిపోవడంతో కుటుంబ సభ్యులు గురువారం రాలేదని తెలుస్తోంది. కొద్ది మంది రాజకీయ కార్యకర్తలు
మాత్రం వచ్చారు. అయితే, వారిని జగన్ చెంతకు అనుమతించలేదు.
0 comments:
Post a Comment