హైదరాబాద్:
ప్రజలు తమ వైపే ఉన్నారని,
తమకు జరిగిన అన్యాయాన్ని ప్రజలు గుర్తిస్తారని జాతీయ మీడియాకు ఇచ్చిన
ఇంటర్వ్యూలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతి రెడ్డి
శుక్రవారం అన్నారు. జైలులో ఉన్నప్పటికీ తన భర్త వైయస్
జగన్ ధైర్యంగానే ఉన్నారని చెప్పారు. ఆయనకు ప్రజల అండదండలు,
ఆశీస్సులు మెండుగా ఉన్నాయన్నారు.
వారి
ఆశీస్సులతో త్వరలోనే బయటకు వస్తారని చెప్పారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
అభిమానులే తమకు అండగా ఉంటారని
చెప్పారు. ఫలితాలు కూడా అలాగే ఉంటాయని
చెప్పారు. వ్యవస్థలోని లోపాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు కొన్ని ఇబ్బందులు సహజంగానే వస్తాయని ఆమె చెప్పారు. అయితే
ప్రజల మద్దతుతో ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కొంటామని చెప్పారు.
తన భర్త వైయస్ జగన్
అరెస్టు జరిగినా తాము ముగ్గురం మహిళలం(వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ,
జగన్ సోదరి షర్మిల, భారతి)
ప్రజల మద్దతుతో ముందుకు కదులుతున్నామని చెప్పారు. జగన్ మధ్యన ఉన్న
నేతను.. జైల్లో పెట్టినా జనం మాత్రం ఆయనను
గుండెల్లో పెట్టుకున్నారని వైయస్ భారతి అన్నారు.
కాగా
బీహార్ పార్లమెంటు సభ్యుడు నిషాద్ చంచల్గూడ జైలులో
ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని
కలిశారు. కాగా వైయస్ విజయమ్మ,
షర్మిలలు కూడా జగన్ను
జైలులో కలిశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.
గెలుపుపై జగన్ ఆనందంగా ఉన్నారని
చెప్పారు.
0 comments:
Post a Comment