హైదరాబాద్:
తెలుగుదేశం పార్టీలో హీరో బాలకృష్ణ కీలకమైన
బాధ్యతలు నిర్వహించాలని భావిస్తున్నారు. అందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టే
ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు తన
అభిమతాన్ని ఆయన నేరుగా తన
బావ, వియ్యంకుడు, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ముందే ఉంచారు. దీంతో
తెలుగుదేశం పార్టీలోని కుటుంబ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి.
తన క్రియాశీలక రాజకీయాల గురించి ఇటీవల ఆయన చంద్రబాబుతో
చర్చించారు. గతంలో ఎన్నడూ లేనంత
గడ్డు పరిస్థితిని పార్టీ ఎదుర్కుంటోందని భావిస్తున్న బాలకృష్ణ చంద్రబాబు కృషి చాలడం లేదని,
చంద్రబాబుకు తోడుగా నిలవాలని, దాంతో పార్టీ ఇమేజిని
పెంచాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన
చంద్రబాబుతో చెప్పారని సమాచారం. ఇందుకుగాను సినిమా షూటింగులను 15 రోజులకు పరిమితం చేసుకుని, మిగతా 15 రోజులు పార్టీ పనికి కేటాయిస్తానని బాలయ్య
చంద్రబాబుతో చెప్పారని అంటున్నారు.
తాను
మండల స్థాయి వరకు పర్యటనలు చేస్తానని,
తద్వారా పార్టీకి కొత్త ఉత్సాహం నింపే
ప్రయత్నం చేస్తానని, తన వల్ల ఏ
మాత్రం కదలిక వచ్చినా పార్టీకి
ఉపయోగపడుతుందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే నటుడిగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రజల్లోకి వెళ్లే కన్నా పార్టీ బాధ్యతలు
తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుందని, పార్టీ శ్రేణుల్లో నమ్మకం పెరుగుతుందని ఆయన అన్నట్లు తెలుస్తోంది.
పార్టీలో
ఏ విధమైన పదవిని కోరుకుంటున్నారో బాలకృష్ణ చెప్పలేదని, అయితే అది తన
గౌరవాన్ని పెంచేదిగదా ఉండాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది..
పార్టీలో క్రియాశీలంగా పని చేస్తానని, వచ్చే
ఎన్నికల్లో పోటీ చేస్తానని బాలకృష్ణ
కొంత కా లం నుంచి
చెబుతున్న విషయం తెలిసిందే. పోటీకి
కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం ఆయన మనసులో ఉ
న్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ తనను కలుస్తున్న
పార్టీ అభిమానులు, సన్నిహితులకు తోడు ఇటీవల అమెరి
కా పర్యటనలో తనను కలిసిన వారు
చెప్పిన విషయాలు బాలకృష్ణను బాగా ప్రభావితం చేసినట్లు
చెబుతున్నారు.
తన అన్న హరికృష్ణ, ఆయన
కుమారుడు జూ.ఎన్టీఆర్‌తో
వస్తున్న సమస్యలపై బాలకృష్ణ కూడా ఇబ్బంది పడుతున్నారని,
ఈ విషయంలో ఆయన చంద్రబాబుపైనే సానుభూతితో
ఉన్నారని కూడా పార్టీ వర్గాలు
చెబుతున్నాయి. కాగా, బాలకృష్ణకు పార్టీలో
క్రియాశీల బాధ్యతలు అప్పగించాలనే అంశంపై బాబుకు సన్నిహితంగా ఉన్న నాయకుల మద్య
కూడా చర్చలు జరుగుతున్నాయి.
0 comments:
Post a Comment