తెలుగుదేశం
పార్టీ ప్రస్తుతం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. బయటి పోరు మాత్రమే
కాకుండా ఇంటి పోరు కూడా
టిడిపిని క్లిష్ట పరిస్థితిల్లోకి నెడుతోంది. టిడిపిలో ఇంటి పోరు తలెత్తినప్పుడల్లా
హీరో నందమూరి బాలకృష్ణ ఒక్కసారిగా బయటకు వచ్చి తాను
రాజకీయాల్లోకి త్వరలో వస్తానని ఓ ప్రకటన చేస్తున్నారు.
గత కొన్నాళ్లుగా ఆయన తాను కొద్ది
రోజుల్లో ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తానని చెబుతున్నారే కాని ఎప్పడు వస్తారో
ఖచ్చితంగా చెప్పడం లేదు.
ఆరేడు
నెలల క్రితం ఆమెరికా పర్యటనలో తాను ప్రత్యక్ష రాజకీయాలలోకి
వస్తున్నట్లు బాలయ్య బాబు ప్రకటించారు. ఆ
తర్వాత పలుమార్లు ఆయన ఇలాంటి ప్రకటనలు
చేశారు. త్వరలో వస్తానని, 2014లో పోటీ చేస్తానని
చెబుతున్నారే గానీ ఇప్పుడు వస్తానని
చెప్పడం లేదు. దీంతో ఆయన
ప్రకటన చేసినప్పుడు తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం కనిపిస్తోంది. ఆ తర్వాత ఆయన
మిన్నకుండిపోవడంతో వారిలో అసంతృప్తి కనిపిస్తోంది.
2014లో
పోటీ చేస్తానని చెప్పే బాలయ్య సాధ్యమైనంత త్వరగా టిడిపిలో చురుకైన పాత్ర పోషించాలని తెలుగు
తమ్ముళ్లు భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో
ఉన్నందున బాలయ్య సాధారణ ఎన్నికలలో అప్పటికి అప్పుడు పోటీ చేస్తే లాభం
ఏమీ ఉండదని, ముందుగానే వచ్చి ప్రజల్లోకి వెళితే
బాగుంటుందని అంటున్నారు. అందుకే ఆయన సాధ్యమైనంత త్వరగా
టిడిపి కోసం పని చేయాలని
కోరుకుంటున్నారు.
శనివారం
బాలయ్య చేసిన ప్రకటన పార్టీలో
మరోసారి ఉత్సాహాన్ని నింపిందనే చెప్పవచ్చు. గతంలో మాదిరిగానే త్వరలో
రాజకీయాల్లోకి వస్తానని చెప్పినప్పటికీ.. ఈసారి కాస్త స్పష్టత
ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ఎప్పుడు వచ్చేది తెలియనప్పటికీ త్వరలో మాత్రం రంగ ప్రవేశానికి సిద్ధమైనట్లుగా
కనిపిస్తోంది. సినిమాల ద్వారా ఒకకోణం చూపించిన బాలయ్య రాజకీయాలలో తన రెండోకోణం చూపిస్తారని
నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
0 comments:
Post a Comment