హైదరాబాద్:
తెలుగుదేశం పార్టీకి సంక్షోభం కొత్త కాదని ఆ
పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
సోమవారం అన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో సోమవారం జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ
సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎస్సీ
వర్గీకరణ తీసుకు వచ్చింది టిడిపియే అన్నారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ
సభ్యుడు హరికృష్ణ, పార్టీ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్
యాదవ్ హాజరు కాలేదు.
వెనుకబడిన
వర్గాలకు టిడిపి ప్రధాన్యత ఇస్తోందని చెప్పారు. టిడిపి చేసిన నిర్ణయాలు దేశవ్యాప్తంగా
ఆదర్శంగా నిలుస్తాయని చెప్పారు. ఇంతవరకు అధికారానికి నోచుకొని వర్గాలకు పార్టీ పాలసీలు ఆదర్శంగా నిలుస్తాయని చెప్పారు. పార్టీలో అన్ని వర్గాలకు సముచిత
న్యాయం ఇస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచిన ఘనత తమ పార్టీదే
అన్నారు. సామాజిక న్యాయం అందరికీ అందించే బాధ్యతను టిడిపి తీసుకుంటుందని చెప్పారు.
వెనుకబడిన
వర్గాలకు రాజ్యాధికారం కల్పిస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బిసిలకు 33 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని,
వాటిని 50 శాతానికి పెంచాలన్నారు. నియోజకవర్గ ఇంచార్జులుగా యువతకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. నామినేటెడ్ పోస్టులలో బిసిలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికలలో బిసిలకు
వంద సీట్లు ఇస్తామని చెప్పారు.
కాగా
కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెసు
పార్టీలో చేరతానని ప్రకటించిన నేపథ్యంలో ఆయన జిల్లా పార్టీ
నేతలతో అత్యవసరంగా సమావేశమయ్యారు. వారితో కొడాలి నాని విషయమై మాట్లాడారు.
అనంతరం జిల్లా నేతలు పార్టీ కార్యాలయంలో
మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కొడాలి నాని వ్యవహార శైలిపై
ధ్వజమెత్తారు.
0 comments:
Post a Comment