హైదరాబాద్:
సినిమాలతో జూనియర్ ఎన్టీఆర్ బిజీగా ఉన్నారని నందమూరి హీరో, తెలుగుదేశం పార్టీ
నాయకుడు బాలకృష్ణ అన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి కార్యక్రమంలో ఆయన శనివారం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజకీయాల్లోకి
ఎప్పుడు రావాలనేది నారా లోకేష్, జూనియర్
ఎన్టీఆర్ ఇష్టమని ఆయన అన్నారు. తాను
ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ఆయన చెప్పారు. నందమూరి
కుటుంబంలో ఏ విధమైన విభేదాలు
లేవని ఆయన అన్నారు.
విభేదాల
పేరుతో అభిమానులను చీల్చవద్దని, ఎవరి అభిమానులు వారికి
ఉంటారని ఆయన అన్నారు. ప్రత్యక్ష
రాజకీయాల్లోకి కచ్చితంగా వస్తానని ఆయన చెప్పారు. ప్రత్యక్ష
రాజకీయాల్లోకి తాను ఎప్పుడు రావాలనేది
పార్టీ నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. స్వార్థంతో
పార్టీలు మార్చేవారికి ప్రజలే బుద్ధి చెప్తారని, నాని వంటివారికి ప్రజలే
తగిన గుణపాఠం చెప్తారని ఆయన అన్నారు.
తాను
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అడగలేదని ఆయన
చెప్పారు. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా
నిర్వహించడానికి తాను సిద్దంగా ఉన్నానని
ఆయన చెప్పారు. నాయకత్వంపై తాను ఏ విధమైన
డిమాండ్లు పెట్టలేదని ఆయన చెప్పారు. పార్టీలో
నాయకత్వ మార్పు అవసరం లేదని ఆయన
చెప్పారు. 2014 ఎన్నికల్లో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడేనని ఆయన స్పష్టం చేశారు.
తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని మాత్రమే చంద్రబాబుకు చెప్పినట్లు ఆనయ తెలిపారు.
పార్టీ
అభిమానులు కోరుకుంటే లోకేష్ రాజకీయాల్లోకి వస్తే తనకేమీ అభ్యంతరం
లేదని ఆయన అన్నారు. అభిమానుల
పేరుతో పార్టీ ప్రతిష్టను దిగజారిస్తే సహించేది లేదని ఆయన అన్నారు.
తన సేవలు ఎలా ఉపయోగించుకోవాలో
పార్టీ నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. పార్టీకి
సేవలు చేయడానికే తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి
వస్తున్నానని ఆయన చెప్పారు. అభిమానులంతా
పార్టీకి అండగా ఉంటారని ఆయన
చెప్పారు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకే అందరూ కృషి చేయాలని
ఆయన అన్నారు.
నందమూరి
అభిమానులను విడగొట్టాలనుకునే వారికి ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. నందమూరి
అభిమానుల మధ్య చిచ్చు పెట్టే
ప్రయత్నాలు సాగుతున్నాయని ఆయన విమర్శించారు. నందమూరి
అభిమానులంతా తనతోనే ఉన్నారని ఆయన చెప్పారు. నందమూరి
కుటుంబ సభ్యులమంతా త్వరలో ఒకే వేదిక మీద
కనిపిస్తామని ఆయన చెప్పారు. బహుశా
వచ్ేచ మహానాడుకు తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి
అడుగు పెట్టవచ్చునని ఆయన అన్నారు.
0 comments:
Post a Comment