హైదరాబాద్:
రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న తనకు
మద్దతు ఇవ్వాలని కేంద్ర మాజీ మంత్రి, యుపిఎ
అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మినికోరారు. ఆదివారం నాడు ఉత్తరాంధ్ర పర్యటనలో
ఉన్న ఆమెతో ప్రణబ్ ఫోన్లో
మాట్లాడారు. పార్టీ కార్యవర్గంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని
ప్రణబ్‌కు విజయలక్ష్మి చెప్పారు.
ఆదివారం
ఉదయం హైదరాబాదు చేరుకోగానే ప్రణబ్ ముఖర్జీ విజయమ్మకు ఫోన్ చేసారు. అయితే
ఆమె అప్పటికే విశాఖపట్నం బయలుదేరారు. విశాఖపట్నంలో విమానం దిగిన కొద్దిసేపటికే మళ్లీ
ప్రణబ్ విజయమ్మకు ఫోన్ చేసి మాట్లాడారు.
పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తోనూ,
పార్టీలోనూ మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని విజయమ్మ ప్రణబ్‌తో చెప్పారు.
ఇందుకోసం
పలు పార్టీల మద్దతు కూడగట్టే క్రమంలో భాగంగా ఆయన ఆదివారం హైదరాబాద్
వచ్చారు. ఆయన కాంగ్రెసు శాసనసభా
పక్షంతో జూబ్లీహాల్లో భేటీ అయ్యారు. రాష్ట్రపతిగా
పోటీ చేయడం అరుదైన గౌరవం
అన్నారు. ఎపి ఓటర్లు తనకు
మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. నాకు మద్దతిచ్చిన వారందరికీ
కృతజ్ఞతలు అన్నారు.
యుపిఏలో
లేకపోయినప్పటికీ తనకు మద్దతిచ్చిన జెడి(యు), శివసేన, సిపిఎం,
ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. మిగిలిన పార్టీలు కూడా తనకు మద్దతివ్వాలని
కోరారు. ప్రణబ్‌ను పలువురు నేతలు
కలుసుకున్నారు. తాజ్ కృష్ణలో ఎంఐఎం
నేతలు ప్రణబ్‌ను కలిశారు.
0 comments:
Post a Comment