న్యూఢిల్లీ,
జులై 10: సమాజంలో నకలీ నోట్లు ఏవో,
అసలు నోట్లు ఏవో కనుక్కోవడం ప్రజలకు
కష్టంగా మారడంతో భారత ప్రభుత్వ రంగ
సంస్ద అయిన రిజర్వ్ బ్యాంక్
ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ప్రజలకు
నకిలీ నోట్లపై అవగాహాన కల్పించేందుకు గాను ఒక వెబ్
సైట్‌ను ప్రారంభించింది. ఆర్‌బీఐ ప్రారంభించిన వెబ్‌సైట్
www.paisaboltahai.rbi.org.in. ఈ
వెబ్ సైట్‌లో రూ.10,20,50,100,500,1,000
నోట్ల డినామినేషన్ అందుబాటులో ఉంచారు. వినియోగదారులు కావాలంటే వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
వీటి
ప్రాతిపదికగా నకిలీ నోట్లను గుర్తించే
వీలుంటుందని ఆర్‌బీఐ ఒక
ప్రకటనలో తెలిపింది. దీనితో పాటు ఒక డాక్యుమెంటరీ
ఫిల్మ్‌ను కూడా ప్రజలకు
డౌన్‌లోడ్ ద్వారా అందుబాటులో
ఉంచారు. ఈ వెబ్‌సైట్
లింక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన
వెబ్‌సైట్ నుండి కూడా
పొందవచ్చు. ఈ సైట్ ద్వారా
నకిలీ నోట్ల చలామణి నెంబర్లు
పొందవచ్చు. మార్చి 31, 2011 నాటికి దేశంలో మొత్తం 64,577 మిలియన్ బ్యాంకు నోట్లు చలామణిలో ఉన్నట్లు ఆర్‌బీఐ అంచనా
వేస్తోంది. 2010-11 ఆర్థిక సంవత్సరంలో 6.74 మిలియన్ బ్యాంకు నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.
దేశంలో
నకిలీ నోట్లు చలామణి చేస్తే ప్రభుత్వం పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటుందని ఆర్‌బీఐ గవర్నర్
దువ్వూరి సుబ్బారావు కోజికోడ్‌లో చెప్పారు. ఈ
నకిలీ నోట్లను తొలగించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన
అన్నారు.
0 comments:
Post a Comment