హైదరాబాద్:
జగతి పబ్లికేషన్స్ డైరెక్టర్‌గా విజయ సాయి
రెడ్డి రాజీనామా చేసినా కంపెనీ ఆర్థిక వ్యవహారాలన్నీ అనధికార వైస్ చైర్మన్‌గా
ఆయనే చూసేవారని ఆ సంస్థ డైరెక్టర్‌గా వ్యవహరించిన హరీష్
సి. కామర్తి సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు. గత నెల 30వ
తేదిన హరీష్ వాంగ్మూలాన్ని సిబిఐ
రికార్డు చేసింది. సండూర్ పవర్‌లో 2000-2001లో
డైరెక్టర్‌గా నియమితుడైన తాను
కర్నాటకలోని కుందాపూర్ సమీపంలో నిర్మాణం, ప్రారంభ పనులను పర్యవేక్షించినట్లు చెప్పారు.
ప్రస్తుతం
భారతి సిమెంట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నానని
చెప్పారు గతంలో తాను జనని
ఇన్ ఫ్రా, జగతి పబ్లికేషన్స్,
సిలికాన్ ఇన్ ఫ్రా, భారతి
సిమెంట్స్ కార్పోరేషన్‌తో పాటు చిన్న
చిన్న కంపెనీలలో కూడా డైరెక్టర్‌గా
ఉన్నట్లు తెలిపారు. గతంలో సండూర్ పవర్స్
అనంతరం భారతి సిమెంట్సులో సాంకేతిక
బాధ్యతలన్నింటినీ తానే పర్యవేక్షించినట్లు చెప్పారు. జగతి,
జనని, ఇతర కంపెనీలలో నామమాత్రపు
డైరెక్టర్‌గా వ్యవహరించే వాడినని
చెప్పారు. వీటిల్లో ఎలాంటి కార్యనిర్వాహక బాధ్యతలను చేపట్టేవాడిని కాదన్నారు. హరీష్‌ను 71వ
సాక్షిగా సిబిఐ ఛార్జీషీటులో పేర్కొంది.
జగతి
పబ్లికేషన్స్‌లోకి నిధుల ప్రవాహాన్ని
సృష్టించడం, కంపెనీ విలువను తప్పుగా లెక్క కట్టించి షేరు
ధరను అనూహ్యంగా పెంచడం వంటి వ్యవహారాలన్నీ వైయస్
జగన్, విజయ సాయి రెడ్డి
కనుసన్నుల్లోనే జరిగాయని, ఇప్పటికీ జగతికి అనధికారిక వైస్ చైర్మన్ సాయి
రెడ్డేనని, దాని ఆర్థిక వ్యవహారాలను
ఆయనే చూస్తారని చెప్పారు. జగన్‌ను సంప్రదించాకే
తన నిర్ణయాలను అమలు చేస్తార'ని
పలు జగన్ సంస్థల్లో డైరెక్టర్‌గా పనిచేసిన హరీష్
సి. కామర్తి సిబిఐ ముందు గుట్టు
విప్పారు.
ఇటీవల
కోర్టులో దాఖలు చేసిన అదనపు
చార్జ్‌షీట్‌లో హరీష్‌ను 71వ సాక్షిగా
సిబిఐ పేర్కొంది. విచారణలో ఆయన కీలక విషయాలు
వెల్లడించారు. ప్రస్తుతం భారతి సిమెంట్స్‌కు
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. జగన్
సంస్థల్లో తాను డైరెక్టర్ హోదాలో
ఉన్నప్పటికీ సుదీర్ఘకాలం సాంకేతిక విభాగం బాధ్యతలు నిర్వహించానని, తనకేమీ ఎగ్జిక్యూటివ్ అధికారాలు లేవని సిబిఐ విచారణలో
హరీష్ చెప్పినట్లు సమాచారం.
జగతిలో
ఒక్కో షేరును రూ.350 ప్రీమియంతో కొనుగోలు చేసిన విషయంపై సిబిఐ
ప్రశ్నించినప్పుడు హరీష్ అసలు గుట్టు
విప్పినట్లు తెలిసింది. ఆ సమయంలో తనతో
పాటు సాయి రెడ్డి కూడా
మరో డైరెక్టర్‌గా ఉన్నారని, పెట్టుబడుల
వ్యవహారమంతా ఆయనే చూశారని, జగన్‌ను సంప్రదించిన తర్వాతే
ఆయన వాటిని సేకరించి ఉండవచ్చని హరీష్ పేర్కొన్నారు. వాస్తవానికి
జగతిని నడిపించడం, కీలక నిర్ణయాలు తీసుకునే
విషయంలో సాయి రెడ్డి పాత్రను
కూడా హరీష్ వివరించారు.
2007 ఆగస్టు-అక్టోబర్ మధ్యలో జగన్‌ను సంప్రదించిన
తర్వాతే జగతి షేరు ధరను
రూ. 350గా విజయ సాయి
రెడ్డి నిర్ణయించారని, అప్పటికే వారి వద్ద ఉన్న
వాల్యుయేషన్ రిపోర్టుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారని
వివరించారు. జననీ ఇన్‌ఫ్రాలో
షేర్ల కేటాయింపు పత్రాలపై తన సంతకాలు ఉన్నప్పటికీ
ఎవరెవరికి షేర్లు కేటాయించాలన్న నిర్ణయం తీసుకున్నది మాత్రం సాయిరెడ్డేనని, జగన్‌ను సంప్రదించాకే
ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని హరీష్ వెల్లడించారు.
0 comments:
Post a Comment