హైదరాబాద్: నందమూరి నట సింహం బాలకృష్ణ కొంత కాలం సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘శ్రీమన్నారాయణ' చిత్రం ఈ నెల 30న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న బాలయ్య ఈ సినిమా విడుదలైన అనంతరం దాదాపు ఐదారు నెలల పాటు పూర్తిగా సినిమా షూటింగులకు దూరంగా ఉంబోతున్నారని తెలుస్తోంది.
ఈ సమయంలో ఆయన ‘బసవ తారకం' క్యాన్సర్ ఆసుపత్రికి సంబంధించిన నిధులు సేకరణ, ఇతర కార్యక్రమాల్లో తలమునకలవ్వడంతో పాటు తన రాజకీయ భవిష్యత్ కార్యచరణపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా తన వారసుడిగా తెరంగ్రేటం చేయనున్న మోక్షజ్ఞకు యాక్టింగ్, డాన్స్, ఫైటింగుల్లో ట్రైనింగ్ ఇప్పించే విషయంపై కూడా దృష్టి పెట్టబోతున్నారు.
ఈ పనులు పూర్తయ్యాక శ్రీమన్నారాయణ తర్వాత బాలయ్య చేయబోతున్న‘ఆదిత్య 999' చిత్రం ప్రారంభం కానుంది. బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘ఆదిత్య 369′ ఎంత పెద్ద హిట్టో, నవ్యత పరంగా ఎంత పెద్ద సంచలనమో చెప్పాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ కెరీర్ లో ఒక మైల్ స్టోన్ అయింది. సీక్వెల్స్ సీజన్ నడుస్తున్న ప్రస్తుత తరుణంలో ఆదిత్య 369కు కొనసాగింపుగా ‘ఆదిత్య 999' చిత్రానికి ప్లాన్ చేస్తున్నారు.
మరో వైపు శ్రీరామరాజ్యం నిర్మాత సాయిబాబు కూడా బాలయ్యతో మరో చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రం శ్రీకృష్ణ దేవరాయల జీవితం ఆధారంగా ఉంటుందని తెలుస్తోంది.

0 comments:
Post a Comment