హైదరాబాద్ : చిరంజీవి 150 సినిమా ఉంటుందా? ఉండదా? అనే అయోమయానికి తెర తీస్తూ మెగాస్టార్ స్వయంగా దీనిపై తన పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రకటన చేశారు. ఓ వార్త పత్రికతో ఆయన మాట్లాడుతూ ‘నా 150వ సినిమా గురించి నా అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. నేను కూడా అంతే ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా ఎంతో ప్రత్యేకం, అందుకే మంచి స్క్రిప్టు కోసం ఎదురు చూస్తున్నాను. స్క్రిప్ట్ నచ్చితే తప్పకుండ చేస్తాను' అని వెల్లడించారు.
చిరంజీవి తాజా ప్రకటనతో అభిమానుల్లో నెలకొన్న సందిగ్ధం తొలగినట్లయింది. చిరంజీవి వ్యాఖ్యలను బట్టి ఈ చిత్రం మెసేజ్ ఓరియెంటెడ్ గా, ఆయన రాజకీయ జీవితానికి ప్లస్ అయ్యేలా....ప్రజలను ఆకర్షించేలా ఉంటుందని స్పష్టం అవుతోంది. ఈచిత్రానికి ఠాగూర్ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహించనున్నారు. చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ స్వయంగా ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారు.
లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న తన చిత్రాన్ని ఎవరికి టార్గెట్ చేయాలి...తన అభిమానులను సంతృప్తిపరచే విధంగా సీన్స్ ఉంచాలా వద్దా అనే విషయాలపై చిరంజీవి తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. గతంలో చిరంజీవి హిట్ చిత్రాలకు పనిచేసిన పరుచూరి బ్రదర్శ్ ... ఈ సినిమాతో మళ్లీ తమ కలం బలం ఏమిటో చూపనున్నారు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నందున సినిమాలో రాజకీయ అంశాలను ఏ మేరకు స్పృశించాలనే విషయమై కూడా వెనకాముందు ఆలోచిస్తున్నారు.
సినిమాలో ఏ సమస్యను ప్రస్తావించినా అది ప్రభుత్వంపై విర్శలాగా ఉంటుంది కనుక...అటు ప్రభుత్వాన్ని నొప్పించకుండా, ఇటు మెసేజ్ ఓరియెంటెడ్ గా ప్లాన్ చేస్తూనే కమర్షియల్ అంశాలతో సినిమాను వినోదాత్మకంగా తెరకెక్కించే సన్నాహాలు జరుగుతున్నాయి.
అయితే ఈచిత్రం ఈ సంవత్సరంలో మొదలయ్యే అవకాశాలు మాత్రం లేవు. ఎందుకంటే వివి వినాయక్ ప్రస్తుతం చరణ్ తో ‘నాయక్' చిత్రాన్ని చేస్తున్నారు. మరో వైపు కథ కూడా ఫైనలైజ్ కాలేదు. ఈ నేపథ్యంలో చిరంజీవి 150వ సినిమా ఈ సంవత్సరం వస్తుందనే ఆశలు వదులుకోవడమే బెటర్.

0 comments:
Post a Comment