హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి బతికి వస్తే మంత్రులు ఆయన కళ్లలోకి సూటిగా చూడగలరా అన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ వ్యాఖ్యలపై కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత ఎన్.తులసి రెడ్డి సోమవారం స్పందించారు. వైయస్ బతికి వస్తే మంత్రులు ఆయన కళ్లలోకి ధైర్యంగా చూడగలరా అని వైయస్ విజయమ్మ ప్రశ్నించారని.. కానీ ముందు వైయస్ కళ్లలోకి చూసి ఆమె మాట్లాడగలరా అని ప్రశ్నించారు.
అసలు ఆయన ముందు ధైర్యంగా నిలబడగలరా అన్నారు. వైయస్ కళ్లలోకి చూసి మాట్లాడే ధైర్యం చేయగలరా అని మంత్రులను ప్రశ్నించే నైతికత విజయమ్మకి ఎంతమాత్రమూ లేదని విమర్శించారు. మరణించేంత వరకూ వైయస్ రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే గడిచిందని చెప్పారు. 2014లో రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా వైయస్ భావించారని పేర్కొన్నారు. కానీ విజయమ్మ ఇందుకు విరుద్ధంగా కాంగ్రెస్‌ని ద్వేషిస్తున్నారన్నారు.
టిడిపిపై కొండ్రు మురళి ఆగ్రహం
రాష్ట్రంలో విద్యుత్ సమస్యను తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తోందని రాష్ట్ర వైద్య, విద్యా శాఖ మంత్రి కోండ్రు మురళీ ఆరోపించారు. టిడిపి ఎమ్మెల్యేలు సోమవారం సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో బైఠాయించడంపై ఆయన స్పందించారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. కేంద్రంతోనూ సంప్రదిస్తున్నారని, 700 నుంచి 750 మెగా వాట్ల విద్యుత్ వారంలో వచ్చే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. కర్ణాటక జలాశయాల నుంచిరాష్ట్రానికి నీటిని విడుదల చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితోనూ కిరణ్ మాట్లాడారని చెప్పారు.
ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు చూసైనా తెలుగుదేశం పార్టీ బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. కాగా, విద్యుత్ సమస్య ఈ రోజే కొత్తగా రాలేదని, హైటెక్ ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హయాంలోనూ ఈ సమస్య ఉందని ఎమ్మెల్యే జోగి రమేశ్ ధ్వజమెత్తారు. 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ సంక్షోభం నెలకొందని, అయినా పరిష్కారం కోసం సిఎం కృషి చేస్తున్నారని ఆయన వివరించారు.

0 comments:
Post a Comment