చిత్తూరు: రాష్ట్ర రాజకీయాల్లో పది రోజుల్లో సమూల మార్పులు జరుగబోతున్నాయని మాజీ మంత్రి, చిత్తూరు జిల్లా పుంగనూరు శాసన సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సోమవారం అన్నారు. పది రోజుల్లోనే తన రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తానన్నారు. సోమవారం ఆయన శ్రీకాళహస్తి ఆలయంలో రాహు కేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఉద్దేశపూర్వకంగానే ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంలో మార్పులు చేయడం బాధాకరమని, రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ సంక్షోభం ఏర్పడిందన్నారు.
కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి రాజకీయ వైరం ఉన్న విషయం తెలిసిందే. కిరణ్‌ను ఆ పీఠం నుండి తప్పించడానికి ఆయన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. కిరణ్‌ను ఆ పదవి నుండి తొలగించడమే తన లక్ష్యంగా ఆయన స్వయంగా చెప్పారు కూడా. ఇందుకోసం ఆయన పలుమార్లు ఢిల్లీ వెళ్లారు. అధిష్టానానికి కిరణ్ తీరుపై ఫిర్యాదులు చేశారు. రెండు రోజుల క్రితం మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి కూడా కిరణ్ పైన విరుచుకుపడ్డ విషయం తెలిసిందే.

0 comments:
Post a Comment