వికీపీడియా
అందించిన సమాచారం ప్రకారం మొట్టమొదటి ఎస్ఎమ్ఎస్ డిసెంబర్ 3, 1992లో లండన్లో
వోడాఫోన్ జిఎస్ఎమ్ నుండి
వెళ్లినట్లు సమాచారం. పర్సనల్ కంప్యూటర్ని ఉపయోగించే 'నెయిల్
పాప్వర్త్' అనే వ్యక్తి 'ఆర్బిటల్
901' హ్యాండ్ సెట్ని ఉపయోగించే
తన స్నేహితుడు రిచర్డ్ జార్విస్కు పంపడం జరిగింది.
ఇంతకీ తాను పంపిన మొట్టమొదటి
ఎస్ఎమ్ఎస్ ఏమిటని అనుకుంటున్నారా.. 'మేరీ క్రిస్టమస్'.
27 సంవత్సరాల
క్రితం అంటే సరిగ్గా 1984లో
ప్రాన్సో - జర్మన్ కార్పోరేషన్కి చెందిన హైలీబ్రాండ్
, బెర్నార్డ్ అనే ఇద్దరు వ్యక్తులు
ఈ ఎస్ఎమ్ఎస్ని టెక్నాలజీని డెవలప్
చేయడం జరిగింది. ఎస్ఎమ్ఎస్ టెక్నాలజీని కనిపెట్టిన 8 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి ఎస్ఎమ్ఎస్ని 1992లో లండన్లో
పంపడం జరిగింది. ఐతే ఇప్పడున్న జనరేషన్లో మాత్రం మొబైల్
ఫోన్స్లలో ఎస్ఎమ్ఎస్లే
ఎక్కువ పాత్రని పోషిస్తున్నాయి.
2010వ
సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా ఎస్ఎమ్ఎస్ ద్వారా వచ్చే ఆదాయం $114.6 బిలియన్
డాలర్లు. దీనిని బట్టి మీకు ప్రస్తుత
మనిషి జీవన విధానంలో ఎస్ఎమ్ఎస్లు ఎంత ముఖ్య
పాత్రని పోషిస్తున్నాయో తెలిసిపోతుంది. రాబోయే ఐదు సంవత్సరాలలో ఎస్ఎమ్ఎస్
ద్వారా మొబైల్ నెట్ వర్క్ సంస్దలకు
వచ్చే ఆదాయం సుమారుగా గుణిస్తే
$726 బిలియన్లని అంచనా.
కాబట్టి
మొబైల్ ఫోన్స్ ఉన్న అందరూ కూడా
'ఎస్ఎమ్ఎస్' కి పుట్టిన రోజు
శుభాకాంక్షలు చెప్పాల్సిన తరుణం వచ్చింది.
0 comments:
Post a Comment