రంజాన్
మాసం వచ్చిందంటే, నోరూరే హైదరాబాది హలీమ్ తిండిప్రియులకు గుర్తుకొచ్చేస్తుంది.
అయితే, ఈ వంటకం తింటే
చాలు తమ తిండి కోరిక
తీరటమే కాక దానితోపాటు లైంగిక
జీవితం అమోఘం అంటున్నారు హైదరాబాది
హలీమ్ తయరీదార్లు. ఒక సారి హలీమ్
తింటే, దాని వాసన రుచి
కొన్ని గంటలపాటు తిన్నవారిని వదలదని, మరోమారు దాని కొరకు రావటం
ఖాయమని చెపుతారు.
ఒక్క
సారి పాతకాలం సంఘటనలు నెమరువేసుకుంటే....దశాబ్దాల కిందట యునాని వైద్యులు,
ఆనాటి హకీం లనబడే డాక్టర్లు
లైంగిక జీవనం మెరుగుపడాలంటే హలీమ్
తినమని వైద్య సలహా ఇచ్చేవారుట.
హలీమ్ తయారీలో వివిధ రకాల డ్రై
ఫ్రూట్స్ లేదా ఎండుఫలాలు వాడతారు.
ఎంతో రుచికరంగా తయారు చేస్తారు. రంజాన్
మాసంలో పేరొందిన ఈ హలీమ్ వంటకం
హైదరాబాద్ లోని ప్రతి ప్రాంతంలోను
విరివిగా బజార్లలో, మార్కెట్లలో, వివిధ రెస్టరెంట్లలో లభ్యమవుతుంది.
హలీమ్ వంటకం తింటే లైంగిక
జీవితం మరింత మెరుగుగా వుంటుందని
దీనిని తినేవారు చెపుతారు.
అయితే,
ఇంత వరకు దీనికి ఏ
రకమైన సైంటిఫిక్ వివరణ రుజువుకాలేదని కూడా
తెలుపుతారు. వంటకం తిన్నవారు మాత్రం
అది తమ వ్యక్తిగత అనుభవమని,
హలీమ్ లైంగికంగా వాంఛలను కలిగిస్తుందని తెలియజేస్తుంటారు. హలీమ్ తయారీలో ఎండు
ఫలాలు మాత్రమే కాక, మాంసం, నెయ్యి,
మసాల దినుసులు కూడా వినియోగిస్తారు. కనుక
బలాన్ని చేకూర్చే ప్రొటీన్లు దీనిలో అధికం. డ్రై ఫ్రూట్స్ గా
బాదం, ఖర్జూర్, అంజీర్, వంటివి వేస్తారు. అంజీర్ పండు పురుషులలో వీర్యకణాల
సంఖ్యను పెంచుతుంది. హలీమ్ తింటే యవ్వనం
పొంగి పొర్లుతుందని పురుషులు భావిస్తారు.
తయారీ
దారులకంటే కూడా హలీమ్ ఔషధ
గుణాలు, దాని ప్రయోజనాలు ముందుగా
వైద్యులకే సుపరిచితంగా పూర్వీకులు చెపుతారు. ఇన్ని మంచి ప్రయోజనాలున్న
హలీమ్ వంటకం...ఎంత తిన్నా ఎప్పటికపుడు
కొత్తగా తినాలనే అనిపిస్తుంది. దీని తయారీ కూడా
తేలికేనని, అతి ఎక్కువ పరిమాణాలలో
ఒకే సారి చేసినప్పటికి నిల్వ
వుండి తినటానికి రుచికూడా పోకుండా వుంటుందని చెపుతారు. మరి ఇన్ని ప్రయోజనాలున్న
హలీమ్ తినే , బహుశ నాటి నవాబులు
తమ శృంగార జీవితంలో అనేకమంది రాణులను అలరించి వుంటారు కాబోలు.
0 comments:
Post a Comment