అమెరికా
ఆటో దిగ్గజం ఫోర్డ్ మోటార్స్ ప్రపంచ మార్కెట్లను టార్గెట్ చేస్తూ అభివృద్ధి చేసిన గ్లోబల్ కాంపాక్ట్
ఎస్యూవీ (స్పోర్ట్స్ యుటిలిటి
వెహికల్) “ఎకోస్పోర్ట్" రోడ్లపై రావటానికి మరెంతో సమయం పట్టదు. ఈ
మోడల్ను వీలైనంత త్వరగా
మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు ఫోర్డ్ సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా ప్రొడక్షన్ వెర్షన్ ఎకోస్పోర్ట్ ఎస్యూవీ ఫోటోలను
కూడా ఫోర్డ్ విడుదల చేసింది.
ఇప్పటికే
ఎకోస్పోర్ట్ ఎస్యూవీని చెన్నై,
బ్రెజిల్ వంటి వివిధ మార్కెట్లలో
టెస్ట్ రన్ కూడా నిర్వహిస్తోంది.
ఫోర్డ్ మోటార్స్ తమ ఎకోస్పోర్ట్ ఎస్యూవీని తొలిసారిగా గడచిన జనవరిలో న్యూఢిల్లీలో
జరిగిన 11వ అంతర్జాతీయ ఆటో
ఎక్స్పోలో ఆవిష్కరించింది. ఫోర్డ్
అందించనున్న ఈ గ్లోబల్ మోడల్
తొలిసారిగా భారత మార్కెట్లోనే విడుదల
కానుంది.
ఎకోస్పోర్ట్
ఎస్యూవీ దాదాపు వంద
దేశాల్లో విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. ఇందులో భాగంగానే నేటి నుండి చైనాలోని
బీజింగ్లో జరుగుతున్న 2012 బీజింగ్
ఆటో షోలో ఫోర్డ్ తమ
ఎకోస్పోర్ట్ ఎస్యూవీని ప్రదర్శనకు
ఉంచింది. ఆకర్షనీయమైన డిజైన్, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, మెరుగనైన నాణ్యత మరియు ధృఢత్వాలతో దీన్ని
రూపొందించామని ఫోర్డ్ పేర్కొంది.
ఎకోస్పోర్ట్
ఎస్యూవీలో సాధారణ సాంప్రదాయ 1.6 లీటర్ పెట్రోల్ ఇంజిన్కు బదులు 1 లీటర్,
3-సిలిండర్ ఎకో బూస్ట్ ఇంజిన్
అమర్చారు. ఇది 118 పిఎస్‌ల శక్తిని,
125 ఎన్ఎమ్ల టార్క్ను
విడుదల చేస్తుంది. ఫోర్డ్ మోటార్స్ నుండి త్వరలో మార్కెట్లోకి
రానున్న "ఎకోస్పోర్ట్" ఎస్యూవీని చెన్నైలో
ఉన్న ప్లాంటులో ఉత్పత్తి చేయనుంది. దీని ఉత్పత్తి కోసం
14.2 కోట్ల డాలర్ల పెట్టుబడులను ఫోర్డ్ వెచ్చించనుంది. ఎకోస్పోర్ట్ ధర రూ.7 లక్షల
నుంచి రూ.8 లక్షల మధ్య
ఉండొచ్చని అంచనా.
0 comments:
Post a Comment