కాకినాడ:
ప్రజారాజ్యం పార్టీని తమ పార్టీలో విలీనం
చేసి రాజ్యసభకు ఎంపిక చేసిన మెగాస్టార్
చిరంజీవికి కాంగ్రెసు పార్టీ అధిష్టానం అగ్ని పరీక్షనే పెట్టినట్లు
తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో చిరంజీవి
సత్తాను ప్రయోగించి, పరీక్షకు పెట్టినట్లు అర్థమవుతోంది. ఆయనకు ఐదు స్థానాల్లో
పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను అప్పగించింది. ఈ విషయాన్ని తన
తూర్పు గోదావరి పర్యటనలో ఆయన స్వయంగా చెప్పారు.
తాను ఐదు స్థానాల్లో కాంగ్రెసు
అభ్యర్థులను గెలిపించే బాధ్యతను తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలోని
18 శానససభా నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనుండగా,
ఐదు స్థానాల బాధ్యతను అప్పగించి, పరీక్షకు పెట్టినట్లు అర్థమవుతోంది. రామచంద్రాపురం, పాయకరావు పేట, తిరుపతి, ఆళ్లగడ్డ,
నర్సాపురం స్థానాల్లో కాంగ్రెసు అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత తనదేనని ఆయన అన్నారు. ఆయన
శనివారంనాడు తూర్పు గోదావరి జిల్లాకు వచ్చారు. ఆయన శానససభ్యుడు బండారు
నివాసానికి వెళ్లారు.
కేంద్రంలో
ఉన్నా, రాష్ట్రంలో ఉన్నా తాను పార్టీకి,
ప్రజలకు సేవలు అందిస్తానని చిరంజీవి
చెప్పారు. అధిష్టానం ఆదేశిస్తే ఉప ఎన్నికలు జరిగే
అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం సాగిస్తానని ఆయన చెప్పారు. తిరుపతి
సీటుకు తాను ఎవరినీ సిఫార్సు
చేయలేదని ఆయన చెప్పారు. రాజ్యసభకు
ఎన్నికైన చిరంజీవి శానససభా సభ్యత్వానికి రాజీనామా చేయడంతో తిరుపతి అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది.
కాగా,
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానంలో గత ఎన్నికల్లో ప్రజారాజ్యం
పార్టీ తరఫున శోభా నాగిరెడ్డి
పోటీ చేసి విజయం సాధించారు.
ఆ తర్వాత ఆమె వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి
మద్దతు పలికారు. తన శానససభా సభ్యత్వానికి
రాజీనామా చేశారు. జగన్కు మద్దతు
తెలిపిన మిగతా కాంగ్రెసు ఎమ్మెల్యేలపై
స్పీకర్ అనర్హత వేటు వేయగా శోభా
నాగిరెడ్డి రాజీనామాను మాత్రం ఆమోదించారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడంతో సాంకేతిక విషయాలను పరిగణనలోకి తీసుకుని శోభా నాగిరెడ్డి రాజీనామాను
ఆమోదించారు.
0 comments:
Post a Comment