కడప:
ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్
రవీంద్రా రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై
ధ్వజమెత్తారు. సోమవారం ఆయన కడప జిల్లాలో
విలేకరులతో మాట్లాడారు. ప్రజల సమస్యలు పరిష్కరించనప్పుడు
రచ్చబండ, ప్రజాపథం వంటి పథకాలు ఎందుకని
ఆయన రవీంద్రా రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భూములు లేని పేదలకు ఐదు
విడతలలో భూములు పంపిణీ చేసినప్పటికీ ఇంత వరకు వారికి
భూములు అందలేదని ఆయన మండిపడ్డారు.
ఎత్తి
పోతల పథకం వల్ల వచ్చే
లాభమేమీ లేదన్నారు. వ్యక్తిగతంగా ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి తాను
పూర్తి వ్యతిరేకిని అని డిఎల్ రవీంద్రా
రెడ్డి చెప్పారు. కాంట్రాక్టర్లు, బ్రోకర్ల కోసమే ఎత్తిపోతల పథకమని
ఆయన ఆరోపించారు. కేవలం పథకాల పేరుతో
సర్దిపెట్టకుండా ప్రజల సమస్యలను ప్రభుత్వం
వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలా అయితేనే ప్రజలు
కాంగ్రెసు పార్టీకి దగ్గరవుతారని చెప్పారు.
మరోవైపు
జూబ్లీహిల్స్ అధికార పార్టీ శాసనసభ్యుడు పబ్బతిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కూడా ప్రజాపథం కార్యక్రమానికి
దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నారు. తన నియోజకవర్గంలోని పలు
సమస్యలను పరిష్కరించనందున విష్ణువర్ధన్ రెడ్డి ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన ప్రజాపథకం కార్యక్రమానికి దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నారు. పెండింగ్ పనులు పూర్తి కాకపోవడం
విష్ణును నిరుత్సాహానికి గురి చేసింది.
కాగా
మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి
సమయం వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
పైన విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. అయితే
ఆదివారం మాత్రం ఆయన తాను రాజకీయాల
పట్ల విసుగు చెందానని, నియోజకవర్గ ప్రజలను సంప్రదించి రాజకీయాల నుండి తప్పుకునే యోచనలో
ఉన్నట్లు తెలిపారు.
0 comments:
Post a Comment