హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో జగతి పబ్లికేషన్స్ వైస్
చైర్మన్ విజయ సాయి రెడ్డి
ఒక్కడినే ఎందుకు అరెస్టు చేశారని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)ని సోమవారం ప్రశ్నించింది.
విజయ సాయి రెడ్డి బెయిల్
సవాల్ చేస్తూ సిబిఐ హైకోర్టులో ఉదయం
లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు
చేసింది. దీనిని కోర్టు మధ్యాహ్నం విచారించింది.
ఈ సందర్భంగా సిబిఐకి కోర్టు చురకలు వేసింది. జగన్ కేసులో పదిహేడు
మంది నిందితులు ఉండగా సాయి రెడ్డిని
ఒక్కడినే ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించింది. ఇతర నిందితులను అరెస్టు
చేయడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని అడిగింది. నిందితుల అరెస్టులో వివక్ష ఎందుకు చూపిస్తున్నారని మొట్టికాయ వేసింది. నిందితులపై వివక్ష చూపించవద్దని సూచించింది. మిగిలిన నిందితుల అరెస్టులో ఆలస్యం గల కారణాలు ఏమిటో
చెప్పాలన్నారు.
ఈ కేసులో విజయ సాయి రెడ్డికి
బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలు మారవచ్చునని,
విచారణకు ఇబ్బంది కలుగుతుందన్న సిబిఐ పైన కోర్టు
ఆగ్రహం వ్యక్తం చేసింది. మిగిలిన నిందితుల కారణంగా విచారణకు ఇబ్బందులు కలగడం లేదా అని
ప్రశ్నించింది. అయితే విజయ సాయి
రెడ్డికి వ్యతిరేకంగా తమ వద్ద ఆధారాలు
ఉన్నాయని సిబిఐ కోర్టుకు తెలిపింది.
త్వరలోనే వాటిని కోర్టుకు సమర్పిస్తామని చెప్పింది.
సిబిఐ
వాదనలు విన్న కోర్టు విజయ
సాయి రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ
నెల పద్దెనిమిదో తారీఖున కోర్టులో హాజరు కావాలని సూచించింది.
వాదనల అనంతరం కోర్టు కేసును బుధవారానికి వాయిదా వేసింది. కాగా సిబిఐ ఉదయం
విజయ సాయి రెడ్డి బెయిలును
రద్దు చేయాలని కోరుతూ కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్
దాఖలు చేసిన విషయం తెలిసిందే.
0 comments:
Post a Comment