హైదరాబాద్:
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై
కాంగ్రెసు సీనియర్ కాంగ్రెసు నాయకుడు, మాజీ మంత్రి జీవన్
రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తమ పార్టీలోనే అసలు
రెడ్లున్నప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ రెడ్డి
అవునా, కాదా అనే చర్చ
అనవసరమని ఆయన సోమవారం మీడియా
ప్రతినిధులతో అన్నారు. కిరణ్ కుమార్ కనీసం
రెడ్లను కూడా ఆకర్షించలేకపోతున్నారని ఆయన తప్పు
పట్టారు.
రెడ్డి
అయి ఉండి కూడా తన
వెంట రెడ్లు రావడం లేదని కిరణ్
కుమార్ రెడ్డి అంటున్నారంటే ఏ విధమైన అభిప్రాయం
కలుగుతుందని ఆయన అన్నారు. రెడ్డి
ముఖ్యమంత్రిగా ఉండి రెడ్లు కాంగ్రెసు
వెంట రావడం లేదంటే ఎలా
అని ఆయన అడిగారు. కిరణ్
కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పార్టీలో
చీలిక ప్రారంబమైందని ఆయన అన్నారు. కిరణ్
కుమార్ రెడ్డి మాటలు కాంగ్రెసు శ్రేణులను
నిరాశకు గురి చేస్తున్నాయని ఆయన
అన్నారు.
తాను
ముఖ్యమంత్రి అయిన ముహూర్తం బాగా
లేదని, మూడు నెలలకు ఒకసారి
ఎన్నికలు వస్తుండడం వల్ల ఏమీ చేయలేకపోతున్నానని
ముఖ్యమంత్రి అంటున్నారని, ఈ విధమైన మాటల
వల్ల కాంగ్రెసు శ్రేణులకు ఏ విధమైన అభిప్రాయం
ఏర్పడుతుందని ఆయన అన్నారు. తెలంగాణపై
కిరణ్ కుమార్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణకు
వ్యతిరేకంగా సీమాంధ్రలో చర్చ జరగడం వెనక
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
ఉన్నారని ఆయన అన్నారు.
మాజీ
మంత్రి జీవన్ రెడ్డి మొదటి
నుంచి కూడా ముఖ్యమంత్రి కిరణ్
కుమార్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. ఆయన వైయస్ రాజశేఖర
రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేవారు. జీవన్ రెడ్డి వైయస్
జగన్ వెంట వెళ్తారనే ప్రచారం
ముమ్మరంగానే ఉంది. అయితే, ఆయన
ఆ విషయం గురించి మాట్లాడడం
లేదు. తెలంగాణపై కూడా ఆయన కిరణ్
కుమార్ రెడ్డిని వ్యతిరేకిస్తూ వస్తున్నారు.
0 comments:
Post a Comment