హైదరాబాద్ : సినీ పరిశ్రమలో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ వెనక ఎలాంటి రాజకీయాలు నడుస్తున్నాయో తాజాగా ‘శ్రీమన్నారాయణ'తో తేలి పోయిందని ఆయన అభిమానులు భగ్గుమంటున్నారు. పరిశ్రమలో అగ్రహీరోల సినిమాలకు, అందులోనూ మంచి కలెక్షన్లతో నడిచే సినిమాల పరిస్థితే ఇలా ఉంటే ఇక చిన్ని సినిమాలు, చిన్న నిర్మాల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇంత కాలం చిన్న సినిమాల నిర్మాతలు ఎంత గగ్గోలు పెట్టినా పెద్దోళ్లు ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా అగ్రహీరో బాలయ్య సినిమాకే సాక్షాత్తు ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడంతో ఇండస్ట్రీలో నిప్పు రాజుకుంది. బాలయ్య వర్గానికి చెందిన వారంతా ఏకమై... పరిశ్రమలోని మరో రెండు టాప్ సినీ ఫ్యామిలీల ఆధిపత్యానికి చెక్ పెట్టాలని, వారి వెనక ఉన్న బడా నిర్మాతల ఆగడాలకు అడ్డుకట్టవేయడానికి ఉద్యమం లేవ దీయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.
బాలయ్య ‘శ్రీమన్నారాయణ' కూకట్‌పల్లి అర్జున థియేటర్ ఇష్యూ లోతుగా పరిశీలిస్తే.....మంచి కలెక్షన్లతో నడుస్తున్న ‘శ్రీమన్నారాయణ' చిత్రాన్ని వారం రోజులకే తీసేసారు. వాస్తవానికి ఆ థియేటర్‌లో ఆ సినిమా కేవలం వారం రోజుల ఒప్పందం మాత్రమే ఉంది. అయితే వారం రోజుల తర్వాత అదే ఏరియాలోనే మరో థియేటర్లో శ్రీమన్నారాయణ చిత్రాన్ని అడ్జెస్ట్ చేయాలని ఫిల్మ్ చాంబర్ నిర్ణయించింది. అయితే డిస్ట్రిబ్యూటర్లు చాంబర్ నిర్ణయాన్ని పట్టించుకోకుండా బాలయ్య సినిమా కూటకట్ పల్లి ఏరియాలో లేకుండా చేసి ఉన్న రెండు థియేటర్లలోనూ నాగార్జున ‘శిరిడి సాయి' చిత్రాన్నే ప్రదర్శిస్తున్నారు.
మరో వైపు ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ తీసుకుంటే ఇక్కడ ఈచిత్రాన్ని కేవలం వారం రోజులకే తీసేసారు. రెండో వారంలో ఇక్కడ బాలయ్య చిత్రానికి సింగిల్ స్క్రీన్ కూడా కేటాయించలేదు. షిరిడి సాయి, రాజ్ 3 చిత్రాలు ఎక్కవు స్క్రీన్లను ఆక్రమించాయి. జులాయి చిత్రం 5వ వారంలోనూ, సుడిగాడు చిత్రం 3వ వారంలోనూ ఇక్కడ ప్రదర్శితం అవుతున్నాయి. అయితే బాలయ్య సినిమాకు మాత్రం చోటు లేదు. ఇదే పరిస్థితి చాలా చోట్ల ఉంది.
ఇటీవల జరిగి చాంబర్ ఎన్నికల్లో ఓడి పోయిన బడా నిర్మాతల ప్యానల్ కావాలనే ఇదంతా చేస్తున్నారని, థియేటర్లు తమ గుప్పిట్లో ఉన్నాయి కాబట్టి తమ ఇష్టాను సారంగా వ్యవహరిస్తూ చాంబర్ నిర్ణయాలను లెక్కచేయడం లేదనే వాదన వినిపిస్తోంది. డబ్బు, రాజకీయ పలుకుబడి ఉన్న వీరంతా ఇలా చేస్తుండటంతో....చిన్న నిర్మాతల ప్యానల్ చాంబర్ పగ్గాలు చేపట్టినా ఫలితం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో బాలయ్య, దాసరి లాంటి వారి సపోర్టుతో పరిశ్రమలో పెద్ద నిర్మాతలు, థియేటర్ల గుత్తేదార్లకు వ్యతిరేకంగా ఉద్యమం లేవదీయాలని, ప్రస్తుతం ఉన్న డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో మార్పులు తెచ్చి అందరికీ న్యాయం జరిగే విధంగా సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను మార్చే దిశగా పోరాటం చేయాలని చూస్తున్నట్ల తెలుస్తోంది.

0 comments:
Post a Comment