హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేత, హీరో నందమూరి బాలకృష్ణ పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించినప్పటి నుండే బాలయ్య పార్టీ బలోపేతంపై దృష్టి సారించినట్లుగా వార్తలు వచ్చాయి. గత కొంతకాలంగా అతను జిల్లా నేతలతో వరుసగా భేటీ అవుతున్నారట. ఆయా జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై వారి నుండి ఆరా తీస్తున్నారట. వరుస భేటీలోతో పార్టీలో కొత్త ఊపు తీసుకు రావడమే కాకుండా బాలయ్య మరో కొత్త బాధ్యత తనపై వేసుకున్నారట.
సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభావం కారణంగా పలువురు జిల్లా స్థాయి నేతలు జగన్‌కు జై కొట్టారు. వారందరినీ తిరిగి పార్టీలోకి రప్పించే బాధ్యతను బాలయ్య తీసుకున్నారని అంటున్నారు. అందుకు ఆయన తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారట. ఆయా జిల్లాలోని పార్టీ నేతల నుండి పార్టీని వీడి జగన్ పార్టీతో సహా ఇతర పార్టీలలో చేరిన వారి లిస్ట్‌ను బాలయ్య తెప్పించుకుంటున్నారట.
ఇప్పటికిప్పుడు ప్రారంభించక పోయినప్పటికీ పార్టీని వీడి వెళ్లిన వారిని తిరిగి రప్పించేందుకు కొద్ది రోజుల్లో బాలయ్య ప్రయత్నాలు కొనసాగిస్తారని అంటున్నారు. ఇటీవల విశాఖ జిల్లాకు చెందిన చెంగల వెంకట్రావు పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. అయితే ఆయన వ్యాఖ్యల్లో బాలయ్యపై అభిమానం కనిపిస్తోంది. ఇలాంటి అసంతృప్తి కలిగిన పలువురు నేతలను బాలయ్య తిరిగి ఖచ్చితంగా పార్టీలోకి రప్పిస్తారని తెలుగు తమ్ముళ్లు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అయితే గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని లాంటి నేతలతో మాత్రం బాలయ్య చర్చించేందుకు సిద్ధంగా లేరని అంటున్నారు. ఉద్దేశ్య పూర్వకంగా వెళ్లిన వారితో కాకుండా పార్టీ పట్ల అభిమానం ఉండి కూడా అసంతృప్తికి లోనై వెళ్లిన వారిని తీసుకు రావాలని బాలయ్య భావిస్తున్నారని అంటున్నారు. పార్టీపై పట్టు సాధించేందుకు, ఉత్సాహం నింపేందుకు కొద్ది రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చేందుకు కూడా బాలయ్య సిద్ధమయ్యారని అంటున్నారు.

0 comments:
Post a Comment