సాధారణంగా
ఆల్కహాల్ వంటి మత్తు పానీయాలు
తాగడం ప్రతివారూ చెడుగానే భావిస్తారు. అయితే, ఈ మత్తు పానీయాలలో
కొన్ని తగుమాత్రంగా తీసుకుంటే శరీరంలోని వివిధ సమస్యలకు పరిష్కారంగా
ఆరోగ్యాన్ని సరి చేస్తాయి. ఆరోగ్యాన్ని
ఆల్కహాల్ వంటి పానీయాలు ఎలా
సరి చేస్తాయి. వీటికి సమాజంలో మంచి పానీయాలుగా ఎటువంటి
ఆదరణ వుంది? అనే అంశాలు పరిశీలించండి.
రమ్
- ఓల్డ్ మాంక్ లేదా కాంటెస్సా
వంటివి మందు ప్రియులు మహా
ఇష్టపడతారు. మన దేశ రక్షక
దళాలలో రమ్ నేటికి అధికంగా
అమ్మకాలు సాగించే పానీయం. రమ్, బ్రాందీ, షాంపేన్
వంటి వాటిని ఔషధాలుగా నేటికి బాంబే ప్రొహిబిషన్ యాక్ట్
1949 క్రింద గుర్తిస్తూనే వున్నారు. రమ్ ను కొద్దిపాటి
గోరు వెచ్చని నీటితో, కొద్ది చుక్కల తేనెతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి
ఎంతో మంచిదిగా చెప్పవచ్చు. తేనె కలిపినందువలన దాని
ఘాటైన వాసన తగ్గుతుంది.
బీర్
- బీర్ అందరికి ప్రయోజనకరమే. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు వయసు
పైపడకుండా చేస్తాయి. విటమిన్ బి 6 గుండె సంబంధిత
రోగాలను తగ్గిస్తుంది. బీర్ కేన్సర్ కణాలతో
పోరాడుతుంది. బీర్ ఎంత నల్లగా
ఎంత చేదుగా వుంటే అంత మంచిది.
బీర్ రక్తనాళాలను వెడల్పు చేస్తుంది. మంచి నిద్ర, మూత్రం
కలిగిస్తుంది. కిడ్నీలలోని రాళ్ళను కరిగిస్తుంది. తాజా సర్వేల మేరకు
యూరప్ లో బీర్ అధికంగా
అమ్మకాలు సాగిస్తోంది. బీర్ తో కడిగేస్తే
వెంట్రుకలు నిగనిగ లాడి కురుల సౌందర్యం
ఏర్పడుతుంది.
బ్రాందీ
- ఈ మత్తు పానీయం గురించి
మీ తాత ముత్తాతలనడిగినప్పటికి దగ్గు, జలుబు,
కఫం వంటివాటి నివారణకు బ్రాందీ ఎంత మంచిదో చెపుతారు.
ఒక్క స్పూన్ తాగినా చాలు, గొంతు నొప్పి
మాయమవుతుంది. బ్రాందీ వాసన కారణంగా తాగలేకుంటే,
దానిలో కొద్దిగా వేడినీరు కలిపి తాగండి. పంటి
నొప్పుల వంటివి బ్రాందీలో ఒక కాటన్ ముక్క
ముంచి పంటిలో పెడితే నొప్పి లాగేస్తుంది.
విస్కీ
- చలికాలం వచ్చిందంటే...విస్కీ అమ్మకాలు బాగా పెరుగుతాయి. కొద్దిపాటి,
తేనె, నిమ్మరసం, వేడినీరు తో కలిపి విస్కీ
ఒక ఔన్సు తీసుకుంటే రోజంతా
మీకు రోగనిరోధక శక్తినిస్తుంది. విస్కీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా
వుంటాయి.
రెడ్
వైన్ - రెడ్ వైన్ లో
కూడా యాంటీ ఆక్సిడెంట్లు వుంటాయి.
కేన్సర్ సెల్స్ పెరగకుండా చేస్తుంది. రోగ నిరోధకతనిస్తుంది. రెడ్
వైన్ రోజుకు 30 మి.లీ. తీసుకుంటే
గుండెకు కూడా మంచిది. రెడ్
వైన్ లో వుండే రిసర్వేటల్
అనే పదార్ధం రక్తనాళాలలోని అడ్డంకులను తగ్గించటంలో, పొత్తి కడుపు భాగంలోని కొవ్వు
నిల్వలను కరిగించటంలో బాగా ప్రయోజనకారి.
0 comments:
Post a Comment