హైదరాబాద్:
అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి జెసి
దివాకర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్ష
నేత ఈటెల రాజేందర్ మధ్య
సోమవారం ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. ఇరువురు నేతలు కాంగ్రెసు పార్టీ
లెజిస్లేచర్ పార్టీ కార్యాలయం వద్ద ఉదయం తారసపడ్డారు.
ఈ సందర్భంగా ఈటెలతో జెసి... రాయల తెలంగాణ మీకు
ఓకేనా అని ప్రశ్నించారు. మేం
రాయల తెలంగాణకు సై అని చెప్పారు.
అందుకు
ఈటెల సమయం వచ్చినప్పుడు ఏదీ
ఆగదని జెసికి సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత జెసి..
తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి
చైర్మన్ ఆచార్య కోదండరామ్ను వెళ్లగొట్టే పని
పెట్టుకున్నారా అంటూ నవ్వుతూ ప్రశ్నించారు.
కాగా కోదండరామ్, భారతీయ జనతా పార్టీపై ఈటెల
రాజేందర్ మీడియాతో మాట్లాడారు.
మహబూబ్
నగర్ నియోజకవర్గంలో తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి
బిజెపికి మద్దతు ఇవ్వడాన్ని ముస్లింలు కోదండరామ్ను ప్రశ్నిస్తున్నారని అన్నారు. దీనికి
సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణపై బిజెపి అనుసరించిన విధానాన్ని జెఏసి ఓసారి సమీక్షించుకోవాలని
సూచించారు. జెఏసి, తెరాసకు మధ్య విభేదాలను ఆయన
కొట్టిపారేశారు. ఇరువురికి మధ్య దూరం పెరిగిందనడంలో
వాస్తవం లేదన్నారు.
కోదండరామ్
ముప్పై ఏళ్లుగా ఓ విధానానికి కట్టుబడి
ఉన్నారని, ముందు ముందు కూడా
అదే పంథా కొనసాగిస్తారని తాము
గట్టిగా నమ్ముతున్నామని చెప్పారు. పరకాలలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడి అభ్యర్థి
కోసం జెఏసి కృషి చేస్తుందని
చెప్పారు. జెఏసి, తెరాస మధ్య విభేదాలు
అంటూ తప్పుడు ప్రచారాలు మానుకోవాలని సూచించారు.
కాగా
తెలంగాణ రాజకీయ జెఏసిలో సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ అందరం ఐక్యంగానే ఉన్నామని
కోదండరామ్ వేరుగా చెప్పారు. ఎలాంటి విభేదాలు ఉన్నా తాము పరిష్కరించుకుంటామని
చెప్పారు. తెరాసకు తమకు దూరం పెరుగుతుందన్న
వార్తలను ఆయన ఖండించారు.
తెరాస
నేతల వ్యాఖ్యలపై విపరీతార్థాలు తీయవద్దని ఆయన సూచించారు. పరకాల
ఉప ఎన్నికలపై ఇప్పటి వరకు ఎలాంటి ఉమ్మడి
నిర్మయం తీసుకోలేదని కోదండరామ్ చెప్పారు. జెఏసిలో చర్చించి పరకాలపై నిర్ణయం తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా
చెప్పారు.
0 comments:
Post a Comment