మెగా
బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ను
హీరోగా పరిచయం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి
2008లోనే రవిబాబు ‘నచ్చావులే’ సినిమా ద్వారా వరుణ్ తేజ్ హీరోగా
ఎంటర్ అవ్వాల్సి ఉంది. అయితే కొన్ని
కారణాల వల్ల ఈ ప్రాజెక్టు
వరుణ్ తేజకు ఓకే కాలేదు.
ఆ తర్వాత 2009, 2010 సంవత్సరాల్లో ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు జరిగినా...మెగా ఫ్యామిలీ అంతా
అప్పుడు రాజకీయాల్లో బిజీబిజీగా గడపడం, 2011లో ప్రజారాజ్యం విలీనం
ఇష్య్యూతో ఈ విషయాన్ని పక్కన
పెట్టారు. ఇప్పుడు అంతా సర్దు కోవడంతో
మళ్లీ వరుణ్ తేజ్ హీరోగా
ఎంట్రీ విషయం దృష్టి పెట్టారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గీతా
ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి స్టార్
గా ఎదిగిన నేపథ్యంలో తన తనయుడికి కూడా
సెంటిమెంటు పని చేస్తుందని నాగాబాబు
ఆశ పడుతున్నాడని ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.
అయితే
మెగాస్టార్ బావమరిది అల్లు అరవింద్...కావాలనే
వరుణ్ తేజ్ ఎంట్రీని ఆలస్యం
చేస్తున్నాడనే పుకార్ల వినిపిస్తున్నాయి. తన చిన్న కొడుకు
అల్లు శిరీష్ హీరోగా పరిచయం అయిన తర్వాతే వరుణ్
తేజ్ను తెరపైకి తేవాలనే
ప్లాన్ వేశాడని, అందుకే వరున్ తేజ్ ఎంట్రీని
డిలే చేస్తున్నాడని అంటున్నారు.
అల్లు
శిరీష్ తొలుత తమిళ్లో
హీరోగా లాంచ్ అయ్యేందుకు రెడీగా
ఉన్నాడు. మిస్టర్ పర్ఫెక్ట్ తమిళ
రీమేక్లో నటించబోతున్నాడు. అక్కడ
హీరోగా సక్సెస్ అయిన తర్వాత తెలుగు
సినిమాలపై దృష్టి పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈనేపథ్యంలో అరవింద్ ఆలోచన మూలంగా వరుణ్
తేజ్ ఎంట్రీ ఇంకా ఆలస్యం అయ్యే
అవకాశం ఉందని ఫిల్మ్ నగర్
జనాలు గుసగుసలాడుకుంటున్నారు.
0 comments:
Post a Comment