హైదరాబాద్:
ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో
బుధవారం మధ్యాహ్నం భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దాంతో
ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి
బయటకు పరుగులు తేశారు. విశాఖపట్నం నుంచి కోస్తాంధ్ర తీర
ప్రాంతాల మీదుగా తిరుపతి వరకు భూప్రకంపనలు చోటు
చేసుకున్నాయి. రెండు నుంచి మూడు
సెకన్ల మేర భూమి ప్రకంపించినట్లు
తెలుస్తోంది. కార్యాలయాలు, ఇళ్ల నుంచి ప్రజలు
బయటకు వచ్చి మళ్లీ వస్తాయనే
భయంతో రోడ్ల మీదనే ఉన్నారు.
విశాఖపట్నం,
భిమిలీ, రాజమండ్రి, నెల్లూరు, తిరుపతి, కాకినాడ, విజయవాడ ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నట్లు ఇక్కడికి
సమాచారం అందింది. బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఈ సంఘటన చోటు
చేసుకుంది. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం, సీతమ్మధార,
ఎన్ఎడి జంక్షన్ వంటి ప్రాంతాల్లో భూప్రకంపనలు
చోటు చేసుకున్నాయి. విజయవాడలోని మొగల్రాజపురం, కస్తూరిబాయిపేట వంటి ప్రాంతాల్లో భూమి
కంపించినట్లు తెలుస్తోంది.
చెన్నైలో
కూడా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇండోనేషియాలో
చోటు చేసుకున్న భారీ భూకంపం వల్లనే
ఆంధ్రప్రదేశ్లోనూ భూప్రకంపనలు చోటు
చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇండోనేషియాలో వచ్చిన భూకంపం వల్ల సునామీ వస్తుందనే
భయాలకు ప్రజలు గురవుతున్నారు. ఇండోనేషియాలోని భూకంపం రెక్టర్ స్కేలుపై 8.9గా నమోదైనట్లు తెలుస్తోంది.
ఇండోనేషియాలో
సునామీ వస్తే దాని ప్రభావం
కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు. మళ్లీ రాష్ట్రంలో భూకంపం
వచ్చే అవకాశాలు మాత్రం లేదని అంటున్నారు. భారతదేశంలోని
తూర్పు ప్రాంతాలపై కూడా ఇండోనేషియా భూకంపం
ప్రభావం పడింది. దీంతో 28 దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. భారతదేశంలోని
గౌహతి, చెన్నై, కోల్కోత్తా, ముంబై,
ఊటీ తదితర ప్రాంతాల్లో కూడా
భూకంపం ప్రభావంతో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
0 comments:
Post a Comment