నందీశ్వరుడు
సినిమా తర్వాత నందమూరి హీరో తారకరత్న హీరోగా
మరో సినిమా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. తారకరత్న,
అర్చన, శ్రద్ధాదాస్, కృష్ణుడు ప్రధాన తారాగణంగా వీరు.కె దర్శకత్వంలో
ఈచిత్రం రూపొందుతోంది. ఆర్.ఎ. ఆర్ట్స్
ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత జాని నిర్మిస్తున్న ఈ
చిత్రం పూజా కార్యక్రమాలు సోమవారం
హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయంలో
జరిగాయి.
అయితే
సినిమా ప్రారంభం అయి ఒక్క రోజు
కూడా కాలేదు ఈ నందమూరి హీరోకి
‘బి’గ్రేడ్ హీరోయిన్ షాకిచ్చింది. హీరోయిన్ శ్రద్ధా దాస్ అతని సినిమా
నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని తన
మైక్రో బ్లాగింగ్ సైట్లో స్వయంగా వెల్లడించింది. కొన్ని పర్సనల్, ప్రొఫెషనల్ రీజన్స్ వల్ల తాను ఆ
చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు శ్రద్ధాదాస్
పేర్కొంది.
తారక
రత్నకు షాకిచ్చే ఒక రోజు ముందు
శ్రద్దాదాస్...తాను తారకరత్న సినిమాలో
హీరోయిన్ గా ఎంపికయ్యాను. దీంతో
ప్రస్తుతం తాను తెలుగులో చేస్తున్న
సినిమాల సంఖ్య 3కు చేరింది అంటూ
ఎంతో ఉత్సాహంగా ప్రకటించిన శ్రద్ధా...24 గంటలు తిరగక ముందు
ఎందుకు తన నిర్ణయం మార్చుకుంది?
అనేది చర్చనీయాంశం అయింది.
అయితే
సినీ పరిశ్రమ నుంచి వినిపిస్తున్న వార్తల
ప్రకారం ఇప్పటికే సరైన గుర్తింపు, అవకాశాలు
లేక సతమతం అవుతున్న శ్రద్ధా
దాస్ కావాలనే ఈ చాన్స్ వదులుకుందని,
తారకరత్న ప్రస్తుతం ఫామ్లో లేక
పోవడం వల్లనే ఇలాంటి నిర్ణయం తీసుకుందని గుసగుసలాడుకుంటున్నారు.
0 comments:
Post a Comment