హైదరాబాద్:
రాష్ట్రంలోని పార్టీ పరిస్థిని చక్కదిద్దే చర్యల్లో భాగంగా కాంగ్రెసు పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్
ఆదివారం హైదరాబాదు వస్తున్నారు. రాష్టంలోని పార్టీ పరిస్థితిపై పార్టీ అధిష్టానం తీవ్రమైన కలవరంతో ఉన్నట్లు అర్థమవుతోంది. ఉప ఎన్నికలను సమర్థంగా
ఎదుర్కోవడానికి పార్టీ నాయకులను గాడిలో పెట్టాలనే ప్రయత్నాలు ఎప్పటికప్పుడు విఫలమవుతున్న నేపథ్యంలో ఆజాద్ రేపు హైదరాబాదు
వస్తున్నట్లు తెలుస్తోంది.
పార్టీ
నాయకుల మధ్య సమన్వయానికి రేపు
సమన్వయ కమిటీ సమావేశం జరిగే
అవకాశాలున్నాయి. ఈ సమన్వయ కమిటీ
సమావేశంలో పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించాలనే ఉద్దేశంతో ఆజాద్ ఉన్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి,
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప
ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను ఢిల్లీ పిలిపించి సమన్వయం సాధించడానికి చేసిన ప్రయత్నాలు కూడా
ఫలించలేదని అధిష్టానం భావిస్తోంది.
ఆజాద్
రాష్ట్ర బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏర్పడిన పార్టీ సమన్వయ కమిటీ వల్ల కూడా
ప్రయోజనం ఉండడం లేదనే విమర్శలు
వస్తున్నాయి. రెండుసార్లు సమావేశాలు జరిగాయి. కానీ ఆ తర్వాత
వదిలేసినట్లే అయింది. ఈ స్థితిలో ఉప
ఎన్నికల్లో సమన్వయానికి మరోసారి సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు
చేస్తే ప్రయోజనం ఏమైనా ఉంటుందేమోనని ఆజాద్
అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
కాగా,
ఉప ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల జాబితాను రూపొందించి, ఆ జాబితాతో పిసిసి
అధ్యక్షుడు ఢిల్లీ వెళ్లారు. ఆయన ఆజాద్తో
సమావేశమయ్యారు. బొత్స సత్యనారాయణ వెల్లడించిన
విషయాలు, ముఖ్యమంత్రిపై కొంత మంది నాయకులు
చేసిన ఫిర్యాదులు పార్టీ అధిష్టానాన్ని ఆందోళనకు గురిచేసినట్లు తెలుస్తోంది. దీంతో స్వయంగా ఆజాద్
హైదరాబాదు రావాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
మరో రెండు, మూడు రోజుల్లో ఉప
ఎన్నికల అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుందని బొత్స
సత్యనారాయణ శనివారం ఢిల్లీలో అన్నారు. కాంగ్రెసు టికెట్ల కోసం ఎవరూ ముందుకు
రావడం లేదనే వార్తలను ఆయన
ఖండించారు. కాంగ్రెసు పార్టీలో టికెట్ల కోసం తీవ్రమైన పోటీ
ఉందని ఆయన మీడియా ప్రతినిధులతో
అన్నారు. ఉప ఎన్నికల వల్ల
పిసిసి కమిటీల ప్రకటన ఆలస్యమవుతోందని ఆయన అన్నారు. పార్టీని
ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఆయన
అన్నారు.
0 comments:
Post a Comment